BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ లో వైల్డ్ కార్డు ఎంట్రీ??

ఈ సారి బిగ్‌బాస్‌ లో గొడవలు, తిట్టుకోవడాలు, ఆ టాస్కులు తప్ప స్పెషల్ గా ఏమి లేవు, ఎంటర్టైన్మెంట్, కామెడీ అస్సలు లేదు. దీంతో షోలో కామెడీ కోసమైనా ఒకర్ని తీసుకురావాలని భావించి.........

BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ లో వైల్డ్ కార్డు ఎంట్రీ??

Baba Bhaskar

 

BiggBoss Non Stop :  టెలివిజన్ నుంచి ఓటీటీకి షిఫ్ట్ అయింది బిగ్‌బాస్‌. గతంలో టీవిలో టెలికాస్ట్ అయినప్పుడే కాస్తో కూస్తో చూసేవారు. ఇప్పుడు ఆ కంటెస్టెంట్స్ అభిమానులు తప్ప బిగ్‌బాస్‌ ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఓటీటీలో టెలికాస్ట్ అవుతుండటం వల్ల బిగ్‌బాస్‌ కి అనుకున్నంత క్రేజ్ కూడా రాలేదు ఈ సీజన్. రోజు రోజుకి బిగ్‌బాస్‌కి హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు.

 

17 మందితో ప్రారంభమైన ఈ షోలో గత ఆరు వారాలు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌, స్రవంతి ఇప్పటికే ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం 11 మంది మాత్రమే మిగిలారు. అయితే ఈ వారంతా నామినేషన్స్ లో అనిల్‌, నటరాజ్‌, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్‌, అరియానా, మహేశ్‌ విట్టా ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఇవాళ రాత్రి వరకు ఆగాల్సిందే. తాజాగా బిగ్‌బాస్‌ లోకి వైల్డ్ కార్డు ద్వారా మరొకరి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

Prashanth Neel : కిక్కులో కిక్కెక్కే కథలు రాస్తాడు

ఈ సారి బిగ్‌బాస్‌ లో గొడవలు, తిట్టుకోవడాలు, ఆ టాస్కులు తప్ప స్పెషల్ గా ఏమి లేవు, ఎంటర్టైన్మెంట్, కామెడీ అస్సలు లేదు. దీంతో షోలో కామెడీ కోసమైనా ఒకర్ని తీసుకురావాలని భావించి ఈ వైల్డ్ కార్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ తన డ్యాన్స్ తోనే కాక తన యాక్టింగ్ తో, కామెడీతో అందర్నీ నవ్విస్తూ ఉంటారు. తను ఎక్కడ ఉన్నా హడావిడి చేస్తూ సరదాగా ఉంటారు. దీంతో బాబా భస్కర్ ని వైల్డ్ కార్డు ద్వారా బిగ్‌బాస్‌ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. బాబా భాస్కర్ గతంలోనే బిగ్‌బాస్‌ లో పాల్గొని ఎంటర్టైన్ చేశారు. గతంలో కూడా కొంతమందిని వైల్డ్ కార్డు ద్వారా తీసుకొచ్చారు కాబట్టి ఈ సారి కూడా వైల్డ్ కార్డు ద్వారా బాబా భాస్కర్ ని తీసుకొస్తారా చూడాలి.