MX Player-Amazon Prime : MX ప్లేయర్ ఓటీటీని అమెజాన్ కొంటుందా?

ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఈ ఓటీటీలు అనేక ఆఫర్లు పెట్టడం, కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లను ఇవ్వడం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఓటీటీ పోటీ నడుస్తుంది. సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉన్న ఇండియా లాంటి దేశాల్లో ఓటీటీలు అందరికి రీచ్ అవ్వాలని చూస్తున్నాయి. ఒక ఓటీటీతో ఇంకో ఓటీటీ పోటీ పడుతుంది...............

MX Player-Amazon Prime : MX ప్లేయర్ ఓటీటీని అమెజాన్ కొంటుందా?

Will Amazon Prime buy MX Player in India?

MX Player-Amazon Prime :  కరోనా సమయంలో, ఆ తర్వాత ఓటీటీకి చాలా డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. సినిమాలు, సిరీస్ లు, షోలతో పలు ఓటీటీలు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా టాప్ ఓటీటీలు ఇండియాలో మార్కెట్ క్రియేట్ చేసుకొని రన్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నిప్లస్ హాట్ స్టార్, జీ 5, సోని లివ్, MX ప్లేయర్, ఆహా, ఆల్ట్ బాలాజీ, ఊట్, సన్ నెక్స్ట్, ఈరోస్ నౌ.. ఇలా అనేక రకాల ఓటీటీలు మన దేశంలో ప్రేక్షకులకి అందుబాటులో ఉన్నాయి.

ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఈ ఓటీటీలు అనేక ఆఫర్లు పెట్టడం, కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లను ఇవ్వడం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఓటీటీ పోటీ నడుస్తుంది. సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉన్న ఇండియా లాంటి దేశాల్లో ఓటీటీలు అందరికి రీచ్ అవ్వాలని చూస్తున్నాయి. ఒక ఓటీటీతో ఇంకో ఓటీటీ పోటీ పడుతుంది. ఈ పోటీలో నెగ్గుకు రావడానికి కొన్ని ఓటీటీలు కొత్త స్ట్రాటజిలని అమలు పరుస్తున్నాయి. అందులో ఒకటి వేరే ఓటీటీలతో మెర్జ్ అవ్వడం లేదా రెండూ కలిసి బిజినెస్ చేయడం.

Daggubati Rana : భూవివాదంలో.. సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానాపై క్రిమినల్ కేసు నమోదు..

ఇటీవల జీ 5, సోనీ లివ్ కలిసిపోయి తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకున్నాయి. తాజాగా టాప్ ఓటీటీల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో MX ప్లేయర్ ని కొందామని ఆలోచనలో ఉన్నటు సమాచారం. ఇప్పటికే ఈ రెండు కంపెనీల ఇండియా హెడ్స్ సమావేశం అయినట్టు కూడా తెలుస్తుంది. అమెజాన్ ఎలాగో టాప్ ప్లేసెస్ లో ఉండి సిరీస్ లు, సినిమాలు అందిస్తుంది. MX ప్లేయర్ లోకల్ గా చాలా కంటెంట్ అందిస్తుంది. ఇందులో డబ్బులు కట్టి ప్రీమియంగా చూడటంతో పాటు యూట్యూబ్ లాగా యాడ్స్ తో ఫ్రీగా చూసే అవకాశం కూడా ఉంది. దీంతో లోకల్ గా MX ప్లేయర్ కి ఎక్కువమంది ప్రేక్షకులు ఉన్నారు. దీంతో Mx ప్లేయర్ ని కొనుక్కొని ఆ ప్రేక్షకులని కూడా అమెజాన్ కి తిప్పేలా చేసుకుందామని ప్లాన్ లో ఉంది. అయితే అమెజాన్ MX ప్లేయర్ ని కొంటుందా? లేక ఇద్దరూ కలిసి బిజినెస్ చేస్తారా అనేది ఇంకా తెలీదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమైతే ఇండియన్ ఓటీటీలలో మరో పెద్ద బిజినెస్ డీల్ అయినట్టే.