Bigg Boss: బిగ్ బాస్ ఆగిపోతుందా? నిర్వాహకులకు షాక్ తప్పదా?

బిగ్ బాస్ గేమ్ షోకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది. మన దేశంలో అయితే.. ఈ షోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే హిందీలో 15 సీజన్లతో పాటు ఓటీటీ కూడా ఓ సీజన్ పూర్తయింది.

Bigg Boss: బిగ్ బాస్ ఆగిపోతుందా? నిర్వాహకులకు షాక్ తప్పదా?

Biggboss

Bigg Boss: బిగ్ బాస్ గేమ్ షోకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది. మన దేశంలో అయితే.. ఈ షోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే హిందీలో 15 సీజన్లతో పాటు ఓటీటీ కూడా ఓ సీజన్ పూర్తయింది. ఇక తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకోగా ఆరవ సీజన్ కు సమయం దగ్గర పడుతుంది. ఐదవ సీజన్ తరువాత గ్యాప్ లోనే ప్రేక్షకుల ఆసక్తిని క్యాష్ చేసుకొనేందుకు షో యాజమాన్యం తెలుగులో కూడా ఓటీటీ తొలి సీజన్ మొదలు పెట్టింది. ప్రస్తుతం తెలుగులో ఓటీటీ తొలి సీజన్ నడుస్తుంది. అయితే.. మెయిన్ షోకు ఉన్నంత ఆదరణ ఓటీటీ షోకు దక్కడం లేదు.

Bigg Boss OTT: ఓటీటీ షో లైవ్ షో కానేకాదు.. నటి షాకింగ్ కామెంట్స్

ఇక, మన దేశంలో మిగతా రాష్ట్రాలలో కూడా ఈ షోకు రెస్పాన్స్ భారీగానే ఉంది. బిగ్ బాస్ షో అంటేనే భారీ మార్కెటింగ్ తెచ్చిపెట్టే రియాలిటీ షో. అసలు ఈ షో పెద్ద బూటకం అన్నా.. ఇందులో టాస్కులన్నీ ముందే ప్రిపేర్ అవుతాయని.. అసలు గేమ్ విన్నర్ ఎవరో కూడా బిగ్ బాస్ ముందే డిసైడ్ చేసి ఉంటాడని కూడా చెప్పుకుంటారు. ఇన్ని విమర్శలు ఉన్నా షోకి ఆదరణ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.. ఇంకా రోజురోజుకీ పెరుగుతుంది. అందుకే నిర్వాహకులు కూడా సీజన్ల మీద సీజన్లు నిర్వహిస్తున్నారు.

Bigg Boss OTT Telugu: రెడ్‌లైట్ ఏరియాకన్నా డేంజర్.. బిగ్‌బాస్‌పై నారాయణ ఫైర్!

అయితే, అసలు బిగ్ బాస్ షో అంటేనే ఓ బూతు షో అని.. ఇందులో కంటెస్టెంట్ల చేత ఒక్కోసారి శృతి మించిన రొమాన్స్, అస్లీలత, ప్రేమ పేరుతో అక్రమ సంబంధాలను కూడా చూపించేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపించేశాయి. బిగ్‌బాస్‌ అనేది సమాజానికి నేరపూరితమైన సంస్థ అని, ఇది ఓ కల్చరల్‌ షో, కల్చరల్‌ ఈవెంట్‌, గేమ్‌ షో కాదని, లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌజ్‌ అంటూ సీపీఐ నాయకులు నారాయణ వంటి వాళ్ళు షాకింగ్‌ కామెంట్స్‌ చేయడమే కాదు కోర్టులకు కూడా వెళ్లారు.

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ లో ఏం జరుగుతుందో మీకు తెలీదు.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి : యాని మాస్టర్

అసలు ఎలాంటి సంబంధంలేని యువతి, యువకులను ఒకే ఇంట్లో పెట్టడం ఏంటని.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ షోను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ షోకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు దాఖలైంది. ఈ విచారణలో భాగంగా హైకోర్టు బిగ్ బాస్ లాంటి షోల్లో హింస, అశ్లీలత తప్ప ఇంకేముందని వ్యాఖ్యానించింది. రియాలిటీ షోల పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే న్యాయస్ధానాలు చూస్తూ ఊరుకోవని గట్టిగా హెచ్చరించింది. కేసు విచారణను వాయిదా వేసినా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇలాంటి రియాలిటీ షోలపై కోర్టుకు కూడా సదభిప్రాయం లేదని అర్ధమైపోతోంది.

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ ఫినాలేకి క్యూ కడుతున్న సెలబ్రిటీలు

దీంతో కోర్టు తదుపరి విచారణ ఎలా ఉండనుంది? కోర్టు తీర్పు ఎలా చెప్తుంది? ఆంక్షలు విధించి షోను నిర్వహించుకోవాలని కోర్టు సూచిస్తుందా? లేక పూర్తిగా మన దగ్గర ఈ షోపై కోర్టు వేటు వేస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి షోను పూర్తిగా బ్యాన్ చేయడం.. రెండు ఆంక్షలు విధించడం. ఇప్పటికే హిందీలో ఈ షోకు ఉన్న ఆదరణ మన దగ్గర లేదు. పిటిషన్ దాఖలైన అస్లీలత, శృతి మించడంలో హిందీలో ఎప్పుడో స్టేజ్ క్రాస్ చేసేసింది. ఇక ఇప్పుడు తెలుగులో ఇంకా ఆంక్షలంటే షోకు దక్కే ఆదరణ కూడా దక్కదు. అప్పుడు రెండు అప్షన్లో కోర్టు ఏ తీర్పు చెప్పినా నిర్వాహకులు నెత్తిన గుడ్డేసుకోవాల్సిందేనా? అనిపిస్తుంది.