Naatu Naatu song Performance : చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ వేదికపై నాటు నాటు పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారా?

ఇప్పటికే ఈ ఆస్కార్ అవార్డు వేడుకల కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ ఆస్కార్ వేదికపై కొన్ని సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఇందులో ఆస్కార్ కి నామినేట్ అయిన వాళ్ళు కూడా పర్ఫార్మ్ చేస్తారు. స్టార్ సెలబ్రిటీలు కూడా ఆస్కార్ వేదికపై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారు................

Naatu Naatu song Performance : చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ వేదికపై నాటు నాటు పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారా?

Will Charan and NTR give naatu naatu performance on stage at the Oscars?

Naatu Naatu song Performance :  ఈ సారి ఆస్కార్ అవార్డులు మనకి మరింత ఆసక్తికరంగా మారాయి. గత సంవత్సర కాలంగా RRR సినిమా ప్రపంచమంతటా సినీ ప్రేక్షకులని, ప్రముఖుల్ని మెప్పిస్తూ సాగుతుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు గెలిచిన RRR సినిమా ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో కూడా నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మార్చ్ 12న జరగనున్నాయి.

ఇప్పటికే ఈ ఆస్కార్ అవార్డు వేడుకల కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ ఆస్కార్ వేదికపై కొన్ని సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఇందులో ఆస్కార్ కి నామినేట్ అయిన వాళ్ళు కూడా పర్ఫార్మ్ చేస్తారు. స్టార్ సెలబ్రిటీలు కూడా ఆస్కార్ వేదికపై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ నామినేషన్స్ లో నిలిచిన లిఫ్ట్ మీ అప్, అప్లాజ్ సాంగ్స్ ని ప్రదర్శిస్తున్నామని దానికి సంబంధించిన ఆర్టిస్టులు తెలిపారు. దీంతో నాటు నాటు పర్ఫార్మెన్స్ కూడా ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు.

Ranbir Kapoor : పాకిస్థానీ సినిమాల్లో నటిస్తా.. వివాదం అయిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రణబీర్..

ఇప్పటికే ఆస్కార్ వేదికపై కీరవాణి స్పెషల్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇటీవల హాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆస్కార్ వేదికపై నాటు నాటు డ్యాన్స్ గురించి స్పందిస్తూ.. మేము నాటు నాటు ఎక్కడ చేయడానికైనా ఇష్టపడతాము. అలాంటిది ఆస్కార్ వేదికపై అవకాశం వస్తే ఎందుకు కాదంటాము అని అన్నారు. దీంతో ఆస్కార్ వేదికపై రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నాటు నాటు సాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇదే జరిగితే RRR మరో సరికొత్త చరిత్ర సృష్టించినట్టే.