‘Rang De’ : నితిన్ కు ‘రంగ్ దే’ కలిసి వస్తుందా

లవ్ స్టోరీలకు చెక్ పెడదామన్న నితిన్ డెసిషన్ కి చెక్ పెట్టేసింది చెక్ మూవీ. డిఫరెంట్ గా ట్రై చేసి సక్సెస్ అవుదామన్న నితిన్ డెసిషన్ కరెక్ట్ కాదేమో అని డౌట్ పడేలా చేసింది చెక్ మూవీ.

‘Rang De’ : నితిన్ కు ‘రంగ్ దే’ కలిసి వస్తుందా

Film

Nitin : లవ్ స్టోరీలకు చెక్ పెడదామన్న నితిన్ డెసిషన్ కి చెక్ పెట్టేసింది చెక్ మూవీ. డిఫరెంట్ గా ట్రై చేసి సక్సెస్ అవుదామన్న నితిన్ డెసిషన్ కరెక్ట్ కాదేమో అని డౌట్ పడేలా చేసింది చెక్ మూవీ. అందుకే అయ్యిందేదో అయిపోయిందనుకుంటూ కలర్ ఫుల్ గా ఆడియన్స్ ముందుకొస్తున్న రొమాంటిక్ మూవీ రంగ్ దే మీద కాన్సన్ ట్రేట్ చేశారు. ప్రొడక్ట్ బావుంది కాబట్టే ప్రమోషన్స్ కూడా అదరగొట్టేస్తూ.. సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నితిన్. లవ్ స్టోరీలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నితిన్..ఆ సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

లేటెస్ట్ గా కీర్తి సురేష్ జంటగా..రంగ్ దే సినిమా ట్రైలర్ చూసిన ఫ్యాన్స్.. లవర్ బాయ్ నితిన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఏదో రూట్ మార్చాలని చూసి చెక్ సినిమా చేసిన నితిన్ ..ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మార్చి 26 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు. అసలు లవ్ స్టోరీలు చెయ్యొద్దని డిసైడ్ అయిన నితిన్ ..రంగ్ దే కథ వినగానే ఏం ఆలోచించకుండా ఓకే చెప్పారట. అందుకే ఈ సినిమా హిట్ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు నితిన్ అండ్ టీమ్. రంగ్ దే సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గరనుంచే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

ప్రమోషన్స్ తో సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని వెంకీ అట్లూరి అంతే బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. స్పెషల్లీ టెక్నికల్ గా రంగ్ దేని రిచ్ గా, క్లాసీగా చూపిస్తున్నారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి యాడెడ్ ఎట్రాక్షన్ అంటున్నారు యూనిట్.  36 ఏళ్ల నితిన్ 24 ఏళ్ల కాలేజ్ కుర్రాడిలా కనిపించడానికి చాలా కష్టపడ్డారు. బాగా వెయిట్ లాస్ అయ్యి యంగ్ గా కనిపించడానికి బాగా వర్కవుట్స్ చేశారు నితిన్. కీర్తిసురేష్ కూడా ఫుల్ స్లిమ్ గా కనిపిస్తున్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసిన రంగ్ దే ప్రేక్షకులకి నచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ శుక్రవారం ధియటర్లోకి వస్తున్నారు.