Will Smith : సడెన్‌గా భారతదేశానికి వచ్చిన విల్ స్మిత్.. ఎందుకో??

ముంబై విమానాశ్రయం వద్ద విల్ స్మిత్‌ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కూడా విల్ స్మిత్ పలుమార్లు భారతదేశానికి వచ్చాడు. తాజాగా...........

Will Smith : సడెన్‌గా భారతదేశానికి వచ్చిన విల్ స్మిత్.. ఎందుకో??

Will Smith

 

Will Smith :  హాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఇటీవల ఆస్కార్ అవార్డు గ్రహీత విల్‌ స్మిత్‌ గత కొంతకాలంగా మీడియాలో హైలెట్ అయ్యారు. ఇటీవల జరిగిన ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో కమెడియన్‌ క్రిస్‌రాక్‌ని విల్ స్మిత్‌ చెంపదెబ్బ కొట్టడంతో బాగా వైరల్ అయ్యాడు. ఈ సంఘటన తర్వాత విల్‌ స్మిత్ పలు సమస్యలని ఎదుర్కున్నాడు. ఆస్కార్ అవార్డ్స్ అందించే మోషన్‌ పిక్చర్ అకాడమీ కూడా విల్‌స్మిత్‌పై 10 ఏళ్ల నిషేధం విధించింది. అయితే విల్ స్మిత్ తాజాగా ఇండియాకి వచ్చాడు.

 

శనివారం (ఏప్రిల్‌ 23న) ముంబై విమానాశ్రయం వద్ద విల్ స్మిత్‌ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కూడా విల్ స్మిత్ పలుమార్లు భారతదేశానికి వచ్చాడు. తాజాగా ఆస్కార్ అవార్డు తీసుకున్న తర్వాత మొదటి సారి విల్ స్మిత్ ఇండియాకి వచ్చారు. ముంబై జుహులోని జెడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో ఆయన బస చేస్తున్నట్లు సమాచారం. విల్‌ స్మిత్‌ ఇండియాకు రావడానికి కారణం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు.

Acharya: ఆచార్య ఈవెంట్‌లో కూల్‌గా.. సింపుల్‌గా.. ఉపాసన

అయితే ఆయన సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కలిసేందుకే విల్‌ స్మిత్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన చెంపదెబ్బ ఘటనతో, ఆ తర్వాత విల్ స్మిత్ ఎదుర్కున్న పరిస్థితులతో అతను గత కొద్ది రోజులుగా విచారంగా ఉన్నారట. దీంతో సద్గురు వద్ద కొంత సమయం గడిపేందుకు వచ్చాడని సమాచారం. గతంలో కూడా విల్ స్మిత్ భారత దేశానికి వచ్చినప్పుడు పలు ఆలయాలని సందర్శించి పూజలు కూడా చేశాడు. తన ఇంట్లో కూడా హిందూ మతాన్ని ఆచరిస్తూ పూజలు చేస్తూ ఉంటారు విల్ స్మిత్. భగవద్గీత, భారత దేశం గురించి గొప్పగా మాట్లాడారు విల్ స్మిత్. ఈ నేపథ్యంలోనే ప్రశాంతత కోసం భారతదేశానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి విల్ స్మిత్ ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారో, ఎవరెవర్ని కలుస్తారో చూడాలి.