Will Smith: విల్ స్మిత్ కీలక నిర్ణయం.. మోషన్ పిక్చర్ అకాడమీకి రాజీనామా..

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తొందరపాటు నిర్ణయంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ వేదికపై వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమెడియన్..

Will Smith: విల్ స్మిత్ కీలక నిర్ణయం.. మోషన్ పిక్చర్ అకాడమీకి రాజీనామా..

Will Smith

Will Smith: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తొందరపాటు నిర్ణయంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ వేదికపై వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమెడియన్ క్రిస్ రాక్ పై విల్ స్మిత్ చేయి చేసుకున్న విషయం విధితమే. విల్ స్మిత్ ప్రవర్తన పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన తరువాత అదే వేధికపై ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న విల్ స్మిత్ .. క్రిస్ రాక్ కు క్షమాపణలు చెప్పారు. మరుసటి రోజు ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించిన విల్ స్మిత్.. తన భార్యపై జోకులు వేయడంతో భరించలేకనే అలా ప్రవర్తించానని వెల్లడించారు.

Hollywood Movies: ఈఏడాది రానున్న టాప్ హాలీవుడ్ సినిమాలు ఇవి

తన తొందరపాటు నిర్ణయానికి క్షమాపణలు కోరుకుంటున్నట్లు తెలిపారు. అయినా ఫలితం లేకుండా పోయింది. విల్ స్మిత్ తీరుపై సర్వత్రా విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. దీనికితోడు ఈ ఘటనపై బుధవారం అకాడమీ గవర్నర్ల బోర్డు సమావేశమై చర్చలు జరిపింది. స్మిత్ పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన బోర్డు, 15రోజుల్లో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో విల్ స్మిత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోషన్ పిక్చర్ అకాడమీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. బోర్డు ఎలాంటి శిక్షలు వేసినా దానికి తాను అంగీకరిస్తానని తెలిపారు.

Hollywood: జేమ్స్ బాండ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్.. హాలీవుడ్‌లో సినిమాల జాతర!

ఆస్కార్ వేడుకలో ప్రవర్తించిన విధానం షాకింగ్ గా, బాధగా ఉందని, అందుకే అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ తెలిపాడు. నేను బాధపెట్టిన వారి జాబితా చాలా పెద్దదిగా ఉందని, నేను అకాడమీ నమ్మకాన్ని వమ్ము చేశానని స్మిత్ వాపోయాడు. అంతేకాక బోర్డు సభ్యులు తీసుకునే ఎలాంటి చర్యలకైనా నేను సిద్ధంగా ఉన్నానని, 94వ అకాడమీ అవార్డుల వేడుకలో నా ప్రవర్తన క్షమించరానిదని విల్ స్మిత్ తన ఆవేదనను వెలుబుచ్చాడు.