కరోనా ఎఫెక్ట్ – మూతపడనున్న థియేటర్లు?

కరోనా వైరస్ విస్తృతం కావడంతో కొద్దిరోజుల పాటు థియేటర్లు మూతపడనున్నాయని తెలుస్తోంది..

  • Published By: sekhar ,Published On : March 5, 2020 / 05:49 AM IST
కరోనా ఎఫెక్ట్ – మూతపడనున్న థియేటర్లు?

కరోనా వైరస్ విస్తృతం కావడంతో కొద్దిరోజుల పాటు థియేటర్లు మూతపడనున్నాయని తెలుస్తోంది..

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని సినిమా థియేటర్లు మూతపడబోతున్నాయా?.. అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19)  ప్రపంచాన్ని గజగజ వణికిస్తుంది. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా అనుమానితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది.

ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలామంది మాస్కులు ధరించి బయటకొస్తున్నారు. షూటింగు నిమిత్తం యూరప్ వెళ్లడానికి ముందు ఎయిర్ పోర్టులో ప్రభాస్ మాస్క్‌తో కనిపించాడు. ఉపాసన, మహేష్ బాబు వంటి పలువురు సెలబ్రిటీలు కరోనా గురించి ప్రజలు భయపడొద్దని సోషల్ మీడియా ద్వారా సందేశాలిచ్చారు. పలు సినిమాల షూటింగులూ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. కొన్ని రోజులు థియేటర్లు మూతపడతాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.(కరెన్సీని కాల్చేసిన కరోనా భయం..డబ్బుని ఓవెన్‌లో పెట్టి బేక్ చేసిన మహిళ)

ఇప్పటికే కరోనా పుట్టినిల్లు చైనాలో కొన్ని ప్రాంతాలలో థియేటర్లు మూసేసిన సంగతి తెలిసిందే. సినిమా హాలులో ప్రజలు కిక్కిరిసి పోతారు. అక్కడ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు ఫిలిం చాంబర్‌లో సమావేశం కానున్నారు.