Buchi Babu Sana: తారక్- బుచ్చిబాబు కాంబోలో సినిమా ఉంటుందా.. ఉండదా?

ఉప్పెన సినిమా తర్వాత సానా బుచ్చిబాబు మరో సినిమా చేయలేదు.. ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు. అయితే తారక్ కి బుచ్చిబాబు చెప్పిన లైన్ నచ్చింది. స్పోర్ట్స్ డ్రామాతో వీళ్ల కాంబోలో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి.

Buchi Babu Sana: తారక్- బుచ్చిబాబు కాంబోలో సినిమా ఉంటుందా.. ఉండదా?

Ntr Buchhibabu

Buchi Babu Sana: ఉప్పెన సినిమా తర్వాత సానా బుచ్చిబాబు మరో సినిమా చేయలేదు.. ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు. అయితే తారక్ కి బుచ్చిబాబు చెప్పిన లైన్ నచ్చింది. స్పోర్ట్స్ డ్రామాతో వీళ్ల కాంబోలో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కాని, తారక్ ఈ బర్త్ డేకి బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే అనౌన్స్ చేశారు కానీ.. బుచ్చిబాబు సినిమాను ప్రకటించలేదు. ఇంతకీ బుచ్చిబాబు, ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఉంటుందా? ఉండదా?

Buchi Babu : ఎన్టీఆర్ – బన్నీతో సినిమా ఎప్పుడు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ సెన్సేషన్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని.. అప్పట్లో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఎన్టీఆర్ బర్త్ డే నాటికైనా ప్రకటనగా మారుతుందని అనుకున్నారంతా.. కాని, తారక్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు అనౌన్స్ చేసి, ఫాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. కానీ బుచ్చిబాబును మాత్రం ఖుషి చేయలేదు.

NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?

నాన్నకు ప్రేమతో టైంలో.. కో డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబుకు.. ఎన్టీఆర్ తో మంచి రిలేషన్ ఏర్పడింది. దాంతో.. ఉప్పెన సూపర్ హిట్ అయ్యాక.. స్పోర్ట్స్ డ్రామా కంటెంట్ తో ఎన్టీఆర్ కి ఓ స్టోరీ లైన్ వినిపించాడు బుచ్చిబాబు. అది తారక్ ను ఇంప్రెస్ చేసింది. కానీ, ఆ తర్వాతే బుచ్చిబాబుకు అసలు పరీక్ష మొదలైంది.. ఫుల్ స్టోరీ డెవలప్ చేసుకుని, తారక్ కి చెప్తే, ఫస్టాఫ్ నచ్చింది, సెకండ్ ఆఫ్ నచ్చలేదు. అలా తారక్ ను ఇంప్రెస్ చేయడానికి ఆ స్టోరీ మీదే కుస్తీ పట్లు పడుతూ ఉన్నాడు బుచ్చిబాబు.

NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!

ఆ మధ్య సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ బుచ్చిబాబుకు డేట్స్ ఇచ్చాడని.. కొరటాల శివ సినిమా తర్వాత.. వీళ్లిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని.. దీనికి.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే న్యూస్ హల్చల్ చేసింది. అదే నిజమైతే ఆ సినిమా ఈ రోజే ప్రకటించే వాళ్లు.. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. జూన్ నుంచి.. కొరటాల శివ డైరెక్షన్లో నటించబోతున్నాడు. ఆ తర్వాత.. ప్రశాంత్ నీల్ సినిమా లైన్లో ఉంది. ఇలా.. ఎన్టీఆర్ లైనప్ అంతా 2 ఇయర్స్ వరకు బిజీగా ఉంది. మరి ఎన్టీఆర్-బుచ్చిబాబు ప్రాజెక్ట్కు సంబంధించి.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందా.. రాదా.. అన్న టాపిక్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.