బాలు కోలుకోవాలని ఓ చిన్నారి అభిమాని ఏం చేసింది తెలుసా!..

  • Published By: sekhar ,Published On : August 27, 2020 / 02:51 PM IST
బాలు కోలుకోవాలని ఓ చిన్నారి అభిమాని ఏం చేసింది తెలుసా!..

#GetWellSoonSPB: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలంటూ తెలుగురాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ తరుణంలో మహర్షి బాదరాయణ్ వ్యాస్ సమ్మాన్ పురస్కార గ్రహీత డా. అద్దంకి శ్రీనివాస్ రచనలో ఆయన ఎనిమిదేళ్ల కుమార్తె వనీజ ఓ పాట పాడింది.



https://10tv.in/ram-gopal-varma-biopic-will-be-three-parts/

‘సాగర సంగమం’ సినిమాలోని… ‘‘వేదం… అణువణువున నాదం’’… అనే పాట బాణీలో ఈ సాహిత్యాన్ని సమకూర్చారు. బాలు త్వరగా మన మధ్యకు రావాలని కోరుకుంటూ తన సంకల్పాన్ని చిన్నారి ఈ పాట రూపంలో వ్యక్తం చేసింది.



కాగా బాలు స్పృహలోకి వచ్చారని, ఆయన శ్వాస ప్రక్రియ బాగా మెరుగైందని.. ఇలాగే నిలకడగా ఉంటే మరో వారం రోజుల్లో ఎక్మో పరికరాన్ని తొలగించే వీలుందని బాలుకి చికిత్సనందిస్తున్న ఎంజీఎం వైద్యుల బృందం తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.