RRR Movie : ఆర్ఆర్ఆర్‌కు కొత్త చిక్కు.. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిల్

అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్ర వక్రీకరించారని హైకోర్టులో పిల్ వేసింది ఓ మహిళ. ఆర్ఆర్ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, విడుదలపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు.

RRR Movie : ఆర్ఆర్ఆర్‌కు కొత్త చిక్కు.. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిల్

Rrr Movie

RRR Movie : కరోనా కారణంగా జనవరి 7న విడుదల కావలసిన ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏తో ఈ సినిమా ఏ రేంజ్‏లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కొత్త తలనొప్పి వచ్చి పడింది. సినిమా విడుదల నిలిపివేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య ఆర్ఆర్ఆర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

చదవండి : RRR Movie: తొలి నుంచి కష్టాలే.. మరోసారి నిరాశ మిగిల్చిన జక్కన్న! పార్ట్-4

అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్ర వక్రీకరించారని ఆమె పిల్ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ను ఆమె కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం వద్దకు వెళ్ళింది ఈ పిల్. పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తెలిపారు.

చదవండి : RRR Movie: తొలి నుంచి కష్టాలే.. 4 ఏళ్ల కల ‘RRR’ సినిమా! పార్ట్-3

ఇక ఈ సినిమా విడుదల కోసం అభిమానులు వేయి కళ్ళతో వెదురుచూస్తున్నారు. ఇద్దరు టాప్ హీరోలు కావడంతో జక్కన తెరకెక్కించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే.. ఈ సినిమా వెయ్యి కోట్లు రాబడుతుందని చెబుతున్నారు విశ్లేషకులు.