వండర్ ఉమన్ 1984 ట్రైలర్: యాక్షన్ సీన్స్‌ అదరిపోయాయ్

  • Published By: vamsi ,Published On : August 23, 2020 / 08:32 AM IST
వండర్ ఉమన్ 1984 ట్రైలర్: యాక్షన్ సీన్స్‌ అదరిపోయాయ్

గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక సినిమా ‘వండర్ ఉమన్ 1984’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో డయానా ప్రిన్స్(గాల్ గాడోట్) మరియు చిరుత (క్రిస్టిన్ వీగ్) ల మధ్య యుద్ధాన్ని చూపించారు. వండర్ ఉమన్ 2017 హిట్ చిత్రానికి సీక్వెల్ ఇది. ట్రైలర్ చూసిన తరువాత ఈ సీక్వెల్ లో విపరీతమైన యాక్షన్ కనిపించబోతోందని స్పష్టమైంది.

యాక్షన్ మరియు ఎనర్జీతో నిండిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో, డయానా ప్రిన్స్(వండర్ వుమన్) తన సూపర్ పవర్‌తో శత్రువులపై పోరాడుతున్నట్లు కనిపిస్తుంది. వండర్ ఉమన్ 2017ని భారత్‌లో కూడా ఆదరించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ చిత్రం అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద చాలా మంచి వసూళ్లు రాబట్టింది.

కాగా.. ఇప్పుడు కూడా ట్రైలర్‌ను తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ విడుదల చేసింది. వండర్ ఉమన్‌గా గాడోట్, స్టీవ్ ట్రెవర్ పాత్రలో పైన్, బార్బరా ఆన్ మినర్వా / చిరుత పాత్రలో విగ్, మరియు మాస్వెల్ లార్డ్ పాత్రలో పాస్కల్, ఆంటియోప్ పాత్రలో రైట్ నటించారు.