Bigg Boss 5 : వరస్ట్ పర్ఫార్మర్ అన్నందుకు సన్నీకి ముద్దులిచ్చిన ప్రియా

కెప్టెన్ సన్నీ దగ్గరికి రావడంతో సన్నీ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ.. ప్రియను వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పాడు. దీంతో ప్రియ.. సన్నీ అని పిలిచి కన్ను కొట్టి

Bigg Boss 5 : వరస్ట్ పర్ఫార్మర్ అన్నందుకు సన్నీకి ముద్దులిచ్చిన ప్రియా

Priya Sanni

Bigg Boss 5 :  బిగ్ బాస్ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవ పెడదామా అని చూస్తూ ఉంటాడు. మొన్నటిదాకా కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అంతా గొడవ పడ్డారు. ఇంకో రెండు మూడు రోజులు సరదాగా ఉంటుంది అనుకున్నారు. కానీ వెంటనే నిన్న వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. గత వారం వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ కొత్తగా సాగింది. దాంతో అందరి మధ్య గొడవలు తలెత్తాయి. కానీ ఈ సారి సింపుల్ గానే వరస్ట్ పర్ఫార్మర్ ని ఎన్నుకున్నారు. నాగార్జున ఒక్కొక్కరిని అడగడంతో వాళ్ళు హౌస్ లో గత వారం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పేశారు.

Bigg Boss 5 : మానస్ ప్రియాంకలకి పెళ్లి చేసిన బిగ్ బాస్

ముందుగా రవి.. ప్రియాంక గత వారం రేషన్ మేనేజర్ గా ఫెయిల్ అయిందని అందుకే ఆమె వరస్ట్ అని పేర్కొన్నాడు. షణ్ముఖ్‌.. సిరి నన్ను మోసం చేసింది గత వారం సీక్రెట్ టాస్క్ లో అంటూ సిరిని వరస్ట్‌ పర్ఫామర్‌ గా ఎన్నుకున్నాడు. సిరి.. కాజల్‌ను వరస్ట్ పర్ఫార్మర్ అంది. విశ్వ.. టాస్క్‌ల్లో సరిగ్గా ఆడట్లేదంటూ ప్రియాంకను వరస్ట్‌ పర్ఫామర్ గా తెలిపాడు. ప్రియాంక, జెస్సీ, ప్రియ ముగ్గురు కలిసి విశ్వను వరస్ట్‌ పర్ఫామర్‌గా చెప్పారు. యానీ మాస్టర్‌.. జెస్సీని, శ్రీరామ్‌.. మానస్‌ను, కాజల్‌.. ప్రియను, మానస్‌.. షణ్ముఖ్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు.

Nayanatara : ఆస్కార్ బరిలో నయనతార సినిమా

ఇక లాస్ట్ కి కెప్టెన్ సన్నీ దగ్గరికి రావడంతో సన్నీ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ.. ప్రియను వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పాడు. దీంతో ప్రియ.. సన్నీ అని పిలిచి కన్ను కొట్టి గాల్లో ముద్దులిచ్చింది. దీంతో సన్నీ సిగ్గుపడిపోయాడు. హౌస్ లో మెజారిటీ సభ్యులు విశ్వను వరస్ట్ పర్ఫార్మర్ గా పేర్కొనడంతో రేపు అతడిని జైల్లోకి పంపిస్తారని నాగార్జున చెప్పారు.