Writer Padmabhushan : ఆడవాళ్ళకి ‘రైటర్ పద్మభూషణ్’ ఫ్రీ షోస్.. ఎక్కడెక్కడో చెక్ చేసుకొని ఫ్రీగా చూసేయండి..

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'రైటర్ పద్మభూషణ్' మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కాగా చిత్ర యూనిట్ ఆడియన్స్ కి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మూవీని ఫ్రీగా చూసేందుకు మూవీ టీం ఆడవాళ్లకి అవకాశం కల్పిస్తుంది.

Writer Padmabhushan : ఆడవాళ్ళకి ‘రైటర్ పద్మభూషణ్’ ఫ్రీ షోస్.. ఎక్కడెక్కడో చెక్ చేసుకొని ఫ్రీగా చూసేయండి..

Writer Padmabhushan free shows

Writer Padmabhushan : యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ ని సంపాదించుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ‘సుహాస్’. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన సుహాస్.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. ఇక ఆ చిత్రంతో సుహాస్ కి మరింత గుర్తింపు వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు చేర వచ్చాయి. ఇటీవల కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. తాజాగా హీరోగా తన రెండో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ‘రైటర్ పద్మభూషణ్’ ఫిబ్రవరి 3న రిలీజ్ అయ్యింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ కలెక్షన్స్.. పెద్ద హిట్ కొడుతున్న మరో చిన్న సినిమా..

ఇటీవలే ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చూసి మూవీ టీంని అభినందించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడవలసిన సినిమా అంటూ సర్టిఫికెట్ ఇచ్చాడు. కాగా చిత్ర యూనిట్ ఆడియన్స్ కి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆడవారికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి, వాటికీ కూడా గౌరవం ఇవ్వాలి అనే పాయింట్ ని చూపించారు. ఆ గౌరవంతోనే ఈ మూవీని ఫ్రీగా చూసేందుకు మూవీ టీం ఆడవాళ్లకి అవకాశం కల్పిస్తుంది. ఈ బుధవారం ఏపీ, తెలంగాణలోని కొన్ని సెంటర్స్ లో ఆడవాళ్ళకి నాలుగు షోలు ఫ్రీగా వేసేలా చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది.

మగవారి జీవితాలను అందంగా చేసిన ఆడవాళ్లు రేపు పద్మభూషణ్ సినిమాకి ఒక మహారాణిలా వెళ్లి ఫ్రీగా చూసేయండి అంటూ థియేటర్స్ లిస్ట్ ని రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 38 థియేటర్లలో ఈ అవకాశం అందుబాటులో ఉంది. మరి ఆ లిస్ట్ లో మీ దగ్గరలోని థియేటర్లు ఉన్నాయేమో చెక్ చేసుకొని ఫ్రీగా సినిమా చూసేయండి. కాగా మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం దాదాపు 5.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.