Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ ఓటిటిలో డేట్ లాక్..

సుహాస్ హీరోగా నటిస్తూ ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. థియేటర్స్ అందర్నీ అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేయడానికి సిద్ధమైంది.

Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ ఓటిటిలో డేట్ లాక్..

Writer Padmabhushan ott release date fix

Writer Padmabhushan : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుహాస్. ఇక హీరోగా పరిచయం అవుతూ తీసిన కలర్ ఫోటో సినిమా ఎంతటి హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. నేషనల్ అవార్డుని కూడా అందుకుంది ఈ చిత్రం. హీరోగానే కాదు విలన్ గా కూడా నటించి అదరగొడుతున్నాడు. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ హిట్-2 సినిమాలో సైకో పాత్రలో నటించి విలన్ గా కూడా మార్కులు కొట్టేశాడు. ఇలా కేవలం ఒక పాత్రకే కట్టుబడి ఉండకుండా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Suhas : ఆ సినిమా తరువాత నా భార్య నన్ను మూడు రోజుల ఇంటిలోకి రానివ్వలేదు.. సుహాస్!

ఇక ఇటీవల మళ్ళీ హీరోగా నటిస్తూ ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సెలెబ్రెటీస్ సైతం ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ మూవీ టీంని ఇంటికి పిలిపించుకొని మరి అభినందించాడు. అంతేకాదు ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాలి అంటూ ట్వీట్ కూడా చేశాడు. ఈ సినిమాలో ఆడవారికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి, వాటికీ కూడా గౌరవం ఇవ్వాలి అనే పాయింట్ ని దర్శకుడు చాలా ఎంటర్‌టైనింగ్ చూపించాడు.

థియేటర్స్ అందర్నీ అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ జీ5 ఈ మూవీ టెలికాస్ట్ కాబోతుంది. ఈ నెల 17వ నుంచి ఈ సినిమా ఓటిటిలో అందుబాటులోకి రానుంది. కాబట్టి ఎవరన్నా థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు ఓటిటిలో చూసేయండి. కాగా ఈ సినిమా మొత్తం మీద 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అంటే నెట్ షేర్ కలెక్షన్స్ దాదాపు 6 కోట్లు సాధించినట్లే. సినిమాకి 4 కోట్ల బడ్జెట్ పట్టింది. దీని బట్టి చూస్తే నిర్మాతలకు 2 కోట్ల లాభం వచ్చినట్లే అర్ధమవుతుంది. కాగా కలర్ ఫోటో సినిమా ఓటిటిలో రిలీజ్ అవ్వడంతో, ఈ సినిమా సుహాస్ కి మొదటి థియేట్రికల్ రిలీజ్ మూవీ.