Writers Guild of America : స్ట్రైక్ చేస్తున్న రైటర్స్.. ఏం చేయాలో తెలియని స్థితిలో హాలీవుడ్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్..

తాజాగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగింది. ఇందుకు కారణం నిర్మాణ సంస్థలు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్నా తమకు మాత్రం కనీస వేతనం ఇవ్వట్లేదంటూ ఆరోపిస్తున్నారు.

Writers Guild of America :  స్ట్రైక్ చేస్తున్న రైటర్స్.. ఏం చేయాలో తెలియని స్థితిలో హాలీవుడ్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్..

Writers Guild of America goes for strike all OTTs in shock

Writers Guild of America : హాలీవుడ్(Hollywood) లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా(Writers Guild of America) సమ్మెకు దిగింది. హాలీవుడ్ టీవీ(TV), ఓటీటీ(OTT), సినిమాలకు కంటెంట్ అందించే రైటర్స్ కు రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అసోసియేషన్ ఉంది. చాలా మంది రైటర్స్ ఈ అసోసియేషన్ లో మెంబర్స్ గా ఉన్నారు. అయితే తాజాగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగింది. ఇందుకు కారణం నిర్మాణ సంస్థలు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్నా తమకు మాత్రం కనీస వేతనం ఇవ్వట్లేదంటూ ఆరోపిస్తున్నారు.

సమ్మెకు వెళ్లేముందు నిర్మాణ సంస్థల యూనియన్ అయిన AMPTP (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో మాట్లాడి తమ డిమాండ్స్ చెప్పినా కూడా పట్టించుకోలేదు. దీంతో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగింది. గత రెండు రోజుల నుంచి హాలీవుడ్ లో ఏ ఒక్క రైటర్ కూడా పని చెయ్యట్లేదు, ఏ కంటెంట్ రాయట్లేదు. వీరి సమ్మెకు హాలీవుడ్ లోని ప్రముఖులు, మరికొన్ని యూనియన్లు మద్దతు పలికాయి. 2007 లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగింది, మళ్ళీ ఇప్పుడు 16 సంవత్సరాల ఆతర్వాత రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగడం గమనార్హం.

రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా డిమాండ్స్..

#తమకు ఇచ్చే వేతనాలు పెంచాలి.
#ఓటీటీ షోలపై బాగా వచ్చే లాభంలో వ్యూయర్ షిప్ ఆధారంగా తమకు రాయల్టీ ఇవ్వాలి.
#ఇటీవల కొంతమంది కథల కోసం AI దగ్గరకు వెళ్తుండటంతో ChatGPT తో పనిచేయకూడదు. రైటింగ్ విషయంలో మానవుని మేధస్సు మించింది లేదని, పరిశ్రమలో AI ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పారు.
#ఒక టీవీ ఎపిసోడ్ కి ఒక్క రైటర్ కాకుండా కనీస నంబర్స్ తో ఒక టీంని మెయింటైన్ చేయాలి.
#12 మిలియన్ డాలర్ల బడ్జెట్ పైన నిర్మించే సినిమాలు, షోలు, సిరీస్ లకు మరింత వేతనం ఇవ్వాలి.
#రైటర్స్ కూర్చొని రాసుకోవడానికి నిర్మాణ సంస్థలలో స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.

వీటితో పాటు మరిన్ని డిమాండ్స్ అడుగుతున్నారు రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా. దీనికి నిర్మాణ సంస్థల యూనియన్ నో చెప్పడంతో సమ్మెకు దిగి గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. అయితే దీనివల్ల హాలీవుడ్ టీవీ షోలు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లో వారం వారం ఎపిసోడ్స్ ఇస్తున్న పలు ఓటీటీ సిరీస్ లపై ప్రభావం చూపించనుంది. కొన్ని రోజులకు మాత్రమే వారి దగ్గర బ్యాకప్ ఉంది. రైటర్స్ రాయకపోతే వాటిని షూట్ చేయలేము. దీంతో ప్రోగ్రామ్స్ ని టెలికాస్ట్ చేయలేరు. దీంతో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మె ఇప్పుడు హాలీవుడ్ టీవీ ఇండస్ట్రీ, పలు ఓటీటీలకు తలనొప్పిగా మారింది.

Adipurush : ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్‌కి రంగం సిద్ధం.. స్పెషల్ స్క్రీనింగ్ థియేటర్ లిస్ట్ ఇదే..

యాపిల్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, సోనీ లాంటి పెద్ద ఓటీటీలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మె గురించి మాట్లాడి త్వరగా సమస్యని పరిష్కరించాలని, లేకపోతే పెద్ద లాస్ చూస్తామని అంటున్నాయి. మరి ఈ సమ్మె ఎన్ని రోజులు జరుగుతుందో చూడాలి. ఒక రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఈ సమ్మె జరిగితే కచ్చితంగా పలు ఓటీటీ, టీవీ సంస్థలు భారీ నష్టాలను చూడటం ఖాయం, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా ఇప్పుడు హాలీవుడ్ లో చర్చగా మారింది.