WWW Movie: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) సినిమా రివ్యూ WWWW (Who, Where, Why) Movie Review

WWW Movie: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) సినిమా రివ్యూ

బాలీవుడ్ స్థాయిలో కాకపోయినా టాలీవుడ్ లో కూడా కొందరు నటీనటుల వారసురాళ్లు తల్లిదండ్రుల వారసత్వాన్ని కెరీర్ గా మలచుకొని ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో రాజశేఖర్-జీవితాల కూతుళ్లు..

WWW Movie: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) సినిమా రివ్యూ

WWW Movie: బాలీవుడ్ స్థాయిలో కాకపోయినా టాలీవుడ్ లో కూడా కొందరు నటీనటుల వారసురాళ్లు తల్లిదండ్రుల వారసత్వాన్ని కెరీర్ గా మలచుకొని ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో రాజశేఖర్-జీవితాల కూతుళ్లు కూడా ఉన్నారు. దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ పెద్ద కూతురు శివాని నటించిన తాజా సినిమా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). కథ, తుంగభద్ర, 24 కిస్సెస్, డియర్ మేఘ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న అరుణ్ ఆదిత్ ఈ సినిమాలో హీరోగా నటించారు. నేషనల్ వైడ్ పేరున్న ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వహించడం విశేషం. సురేష్ ప్రొడక్షన్ సమర్పణ, గుహన్ దర్శకత్వం వహించడంతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించారు. సైబర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కథతో తెరకెక్కిన ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఇది ఫిల్మ్ లవర్స్ ను ఎంతగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

నటీనటులు: శివాని రాజశేఖర్, అదితి అరుణ్, సందీప్ భరద్వాజ్‌, రియాజ్‌ ఖాన్‌, సత్యం రాజేశ్‌, ప్రియదర్శి తదితరులు
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
సంగీతం: సిమోన్ కే కింగ్
ఎడిటింగ్‌: తమ్మిరాజు
నిర్మాణ సంస్థ: రామంత్ర క్రియేషన్స్
నిర్మాత: రవి పి రాజు దాట్ల
దర్శకత్వం: కేవీ గుహన్

Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ

కథ:

హీరో విశ్వ (అరుణ్ ఆదిత్) ఆత్మహత్య ప్రయత్నంతో సినిమా మొదలువుతుంది. మొదటి సన్నివేశమే ఆసక్తి కలిగిస్తుంది. ఇంతలో కొన్ని నెలలు కిందటకి కథ వెళ్తుంది. విశ్వ అతని స్నేహితులు అష్రఫ్ (ప్రియదర్శి), క్రిస్టీ (దివ్య శ్రీపాద), సదా (సత్యం రాజేశ్) నలుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. దేశంలోని వివిధ నగరాల్లో నివసించే వీరు ఆన్ లైన్ ద్వారా పనిచేస్తుంటారు. క్రిస్టీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలు మిత్ర (శివాని రాజశేఖర్)ను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా లవ్ చేస్తాడు విశ్వ. కామన్ ఫ్రెండ్స్ కాబట్టి మిత్ర, విశ్వకు స్నేహితురాలు అవుతుంది. మిత్ర సోదరుడికి విశ్వ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఒకరికొకరు నచ్చి విశ్వ, మిత్ర ప్రేమించుకుంటారు. మిత్రను చూసేందుకు బెంగళూరు వెళ్లాలని విశ్వ అనుకుంటూ ఉండగా.. ఇండియా మొత్తం లాక్ డౌన్ పెట్టేస్తారు. ఈ టైమ్ లో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకుంటారు ఈ ప్రేమ జంట. ఒకరోజు క్రిస్టీ ఇంటికి ఒక ఆగంతుకుడు వచ్చి ఆమెను కత్తితో పొడుస్తాడు, మిత్రను కూడా చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ఉన్మాది క్రిస్టీ ఇంటికి ఎందుకు వచ్చాడు.. ఆమెను ఎందుకు చంపాడు.. మిత్రను బంధీగా పట్టుకోవడానికి కారణం ఏంటి.. విశ్వకు ఈ నేరస్తుడికి సంబంధం ఉందా అనేది ట్విస్టులతో సాగే మిగిలిన కథ.

Malladi Vishnu: నాని మాట్లాడింది తప్పు.. టిక్కెట్ల తగ్గింపు పేదలకే మేలు!

విశ్లేషణ:

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఓ మంచి కథతో తెరకెక్కింది. తెలిసో తెలియకో కొందరు చేసే తప్పులు ఇతరుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో ఈ సినిమాలో చూపించారు. నేరం చేసేప్పుడు సులువుగానే ఉండొచ్చు. కానీ దాని చెడు ఫలితం కొన్ని జీవితాలను బలి తీసుకుంటుంది. ఇవాళ ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో సైబర్ క్రైమ్ దాడికి గురవుతున్నవారే. ఎక్కడో ఏ దగ్గర మోసపోతున్నవారే. అలాంటి నేరాలు చేసేవారికి కనువిప్పు లాంటి సినిమా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మేకింగ్ ఇలా టెక్నికల్ గా క్వాలిటీ కనిపించింది. సినిమా అంతా కంప్యూటర్ స్క్రీన్ మీద చూపించడం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాలో కనిపించే కొత్తదనం. సినిమాటోగ్రాఫర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కెవి గుహన్ దర్శకత్వం వహించడం ఈ సినిమాలోని మరో విశేషం. సినిమాటోగ్రాఫర్ దర్శకుడు అయినా తన ప్రతిభ చూపించేందుకు ఎక్కడా కథను దాటే ప్రయత్నం చేయలేదు కేవి గుహన్. కథను ఉన్నంతలో బ్యుటిఫుల్ గా తెరకెక్కించాడు. వీడియో కాల్స్ ద్వారా పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల లైఫ్ చూపిస్తూ.. ఇందులోనే ఓ లవ్ స్టోరీని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ మంచి కథనూ చూపించాడు దర్శకుడు కేవి గుహన్.

AP Movie Theaters: నిన్న థియేటర్లు సీజ్.. నేడు స్వచ్ఛందంగా బంద్!

నటీనటులు:
విశ్వ క్యారెక్టర్ లో అరుణ్ ఆదిత్ మెప్పించాడు. భావోద్వేగాలు, పశ్చాతాపం తన క్యారెక్టర్ లో చూపించాడు. మిత్ర పాత్రలో శివాని రాజశేఖర్ అద్భుతంగా నటించింది. ఓ చక్కటి తెలుగు అమ్మాయిలా సంప్రదాయంగా కనిపించిన శివాని.. ఎమోషనల్ సీన్స్ లో ప్రతిభ చూపించింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ చిత్రంలో శివానికి హీరోతో సమానంగా స్క్రీన్ టైమ్ ఉంటుంది. దివ్య, ప్రియదర్శి, సత్యం రాజేష్, వీళ్లందరి పాత్రలకు కథలో మంచి స్కోప్ ఉంది. వీళ్లంతా తమ తమ క్యారెక్టర్ లకు న్యాయం చేశారు. వైవా హర్ష వీలైనంత నవ్వించే ప్రయత్నం చేశాడు. ఒక మంచి కథతో ఆకట్టుకునేలా రూపొందిన సైబర్ క్రైమ్ మూవీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సందేశం ప్రయోగం రెండూ కలిసిన చిత్రమిది.

×