KGF3: కేజీయఫ్ 3.. ఆగాల్సిందే అంటోన్న రాఖీ భాయ్!

కన్నడలో తెరకెక్కిన ‘కేజీయఫ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనం చూశాం. ఈ సినిమాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమాలకు ప్రేక్షకులు పట్టం కట్టారు.

KGF3: కేజీయఫ్ 3.. ఆగాల్సిందే అంటోన్న రాఖీ భాయ్!

Yash Gives Clue On Doing KGF 3

Yash: కన్నడలో తెరకెక్కిన ‘కేజీయఫ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనం చూశాం. ఈ సినిమాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమాలకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక కేజీయఫ్, కేజీయఫ్ 2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను ఓ చెడుగుడు ఆడుకున్నాయి. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమాలతో మాస్ ఆడియెన్స్ ఈ సినిమా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Yash : 700 మందికి సెల్ఫీలు ఇచ్చిన రాకీ భాయ్..

కాగా, కేజీయఫ్ చాప్టర్ 2 తరువాత కేజీయఫ్ 3 కూడా ఉండబోతుందనే క్లూ అయితే చిత్ర యూనిట్ ఇచ్చింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చిత్ర యూనిట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా ఇప్పట్లో వస్తుందో లేదో అని అందరూ అనుకుంటున్నారు. కాగా, తాజాగా హీరో యశ్ కేజీయఫ్ 3 గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. తన నెక్ట్స్ మూవీని దర్శకుడు నార్తన్‌తో తెరకెక్కించేందుకు యశ్ రెడీ అవుతున్నాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.

Yash: లోకేశ్‌తో రాఖీ భాయ్ భేటి.. వైరల్ అవుతున్న పిక్!

కానీ, ఈ సినిమాను ఇంకా యశ్ ఓకే చేయలేదని.. ఈ సినిమా పట్టాలెక్కాలంటే ఇంకా సమయం పడుతుందని యశ్ తాజాగా చెప్పుకొచ్చాడు. అయితే కేజీయఫ్ 3 సినిమాను ముందుగా తెరకెక్కిస్తాడని అభిమానులు ఆశించగా, దానికి కూడా చాలా సమయం పడుతుందని యశ్ పేర్కొన్నాడు. ఇలా కేజీయఫ్ 3 మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాలంటే ఆయన సలార్ మూవీని పూర్తి చేశాక.. ఎన్టీఆర్‌తో సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే కేజీయఫ్ 3కి సంబంధించిన పనులు ప్రారంభం అవుతాయని.. అంటే, యశ్ ఈ సినిమా‌ను ఇప్పట్లో తెరకెక్కించబోడనే క్లారిటీ ఇచ్చేశాడు. మరి యశ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా.. ఎప్పుడు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.