YRF SPY UNIVERSE : YRF స్పై యూనివర్స్.. బాలీవుడ్ లో గట్టిగా ప్లాన్ చేస్తోన్న యశ్ రాజ్ ఫిలిమ్స్..

పఠాన్ ప్రజెంట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. బాలీవుడ్ లో ఇప్పటి వరకూఎన్ని స్పై యాక్షన్ సినిమాలొచ్చినా వాటన్నింటనీ మించి యాక్షన్ కా బాప్ అనిపించుకుంటోంది పఠాన్ మూవీ. ఈ ఒక్క స్పై సినిమాయే 700కోట్ల కలెక్షన్లను క్రాస్ చేస్తుంటే పఠాన్ కి తోడు టైగర్, జోయా కూడా యాడ్ అయితే ఆ యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతోంది..?.............

YRF SPY UNIVERSE : YRF స్పై యూనివర్స్.. బాలీవుడ్ లో గట్టిగా ప్లాన్ చేస్తోన్న యశ్ రాజ్ ఫిలిమ్స్..

Yash Raj Films Creating YRF SPY UNIVERSE in Bollywood

YRF SPY UNIVERSE :  పఠాన్ ప్రజెంట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. బాలీవుడ్ లో ఇప్పటి వరకూఎన్ని స్పై యాక్షన్ సినిమాలొచ్చినా వాటన్నింటనీ మించి యాక్షన్ కా బాప్ అనిపించుకుంటోంది పఠాన్ మూవీ. ఈ ఒక్క స్పై సినిమాయే 700కోట్ల కలెక్షన్లను క్రాస్ చేస్తుంటే పఠాన్ కి తోడు టైగర్, జోయా కూడా యాడ్ అయితే ఆ యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతోంది..? ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే టాపిక్ నడుస్తుంది. హాలీవుడ్ లో ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఉండే కనెక్టివిటీ ఉన్న సినిమాటిక్ యూనివర్స్ మెల్లిమెల్లిగా ఇండియాకి కూడా పాకుతుంది. ఇప్పటికే తమిళ్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్, తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నడుస్తున్నాయి.

ఇప్పుడుబాలీవుడ్ లో YRF స్పై యూనివర్స్ నడుస్తుంది. పఠాన్ హిట్ అవ్వడంతో YRF ప్రొడక్షన్ లో వచ్చిన పాత స్పై సినిమాలు, పఠాన్, రాబోయే సినిమాలు, మరి కొన్ని కొత్త సినిమాలతో లింక్ చేస్తే YRF స్పై యూనివర్స్ రెడీ అవుతుంది అంటూ యశ్ రాజ్ ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించాయి. పఠాన్ సినిమా యాక్షన్ మూవీస్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. అసలు బాలీవుడ్ లో, స్పెషల్లీ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ అన్నింటిలో టాప్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో పఠాన్ 800 కోట్లకు దగ్గరవుతుంటే 2017 లో వచ్చిన సల్మాన్ ఖాన్ స్పై యాక్షన్ మూవీ టైగర్ జిందా హే 560 కోట్లు కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్ కొట్టేసింది. ఇక 2019 లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్లోనే వచ్చిన పవర్ ఫుల్ స్పై మూవీ వార్ 477 కోట్లు కలెక్ట్ చేసింది. 10 ఏళ్ల క్రితం సల్మాన్ టైగర్ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ గా వచ్చిన ఏక్ థా టైగర్ 318 కోట్లు కలెక్ట్ చేసింది.

యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ మోస్ట్ కలెక్షన్లు పఠాన్ వే. ఒక్క పఠానే 800కోట్ల కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుంటే ఇక ఈ 4 సినిమాల్ని కలిపి, రాబోయే సినిమాలతో కలిపి స్పై యూనివర్స్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని అంచనాలు వేస్తున్నారు బాలీవుడ్ వర్గాలు. త్వరలోనే టైగర్ ఫ్రాంచైజ్ ఈ స్పై సినిమాలతో కలిసేలా ప్లాన్ చేస్తోంది టీమ్. ఒక్క హీరోకే వందల కోట్ల మార్కెట్ ఉంటే ఈ నలుగురూ కలిస్తే సినిమా నెక్ట్స్ లెవల్ లో ఉంటుందంటున్నారు ఫాన్స్.

స్పై ఏజెంట్ గా ఏక్ థా టైగర్ స్టార్ట్ చేసిన సల్మాన్ టైగర్ జిందా హేతో మరో స్పై యాక్షన్ ని సూపర్ హిట్ చేశారు. ఆల్రెడీ సిద్దార్ద్ ఆనంద్ వార్ లో హృతిక్ రోషన్ ఉన్నాడు కాబట్టి ఒక వైపు సల్మాన్, హృతిక్ తో పాటు పఠాన్ కూడా కలిసి అతిపెద్ద స్పై యూనివర్శ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్, జాన్ అబ్రహం కూడా ఉంటారంటూ హింట్ ఇచ్చింది రైటింగ్ టీమ్.

Lokesh kanagaraj : తమిళ్ లో అందరి చూపు ఇతని మీదే.. పదేళ్ల వరకు ఢోకా లేదంటున్న లోకేష్ కనగరాజ్..

ఆల్రెడీ అడ్వెంచర్ క్యారెక్టర్స్ గా సూపర్ హైప్ లోఉన్న టైగర్, కబీర్, పఠాన్, జోయా, రుబై అందర్నీ ఇన్వాల్స్ చేసి స్పై యూనివర్స్ లో చూపించబోతున్నారు. అంతేకాదు ఈ మెయిన్ క్యారెక్టర్స్ తో పాటు మరికొంత మంది క్రేజీ స్టార్స్ ని యాడ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. స్పై లు డిల్లీ, ముంబై లేదా లోకల్ ఏరియాస్ నుంచే రావాలని లేదు ఎక్కడినుంచైనా కూడా స్పై లు రావచ్చు అంటూ హాలీవుడ్ యాక్టర్లు ఉండొచ్చంటూ హింట్ ఇచ్చారు మేకర్స్. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ యాక్షన్ హీరోలు కూడా యాడ్ అయితే ఈ స్పై యూనివర్శ్ మూవీ అవెంజర్స్ తరహా లో ఇండియన్ సినిమాకే హైలైట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ స్పై యూనివర్స్ ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాలి.