YRF Entertainment: యశ్‌రాజ్ భారీప్లాన్.. సల్మాన్, షారుఖ్, హృతిక్‌తో వెబ్ సిరీస్!

కోట్లు పెట్టుబడి పెట్టే సినిమా నిర్మాతలకి కొత్త ఆలోచనలొస్తున్నాయి. కష్టపడి వాళ్లు ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్టులను వేరే ఓటీటీలకు ఇవ్వడం ఎందుకు.. సొంతంగా ఓ ఓటీటీ పెట్టేస్తే పోలే..

YRF Entertainment: కోట్లు పెట్టుబడి పెట్టే సినిమా నిర్మాతలకి కొత్త ఆలోచనలొస్తున్నాయి. కష్టపడి వాళ్లు ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్టులను వేరే ఓటీటీలకు ఇవ్వడం ఎందుకు.. సొంతంగా ఓ ఓటీటీ పెట్టేస్తే పోలే అనుకుంటున్నారు. ఎలాగూ కొవిడ్ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఎలా దున్నేస్తున్నాయో మేకర్స్ కి తెలియంది కాదు. అందుకే స్వయంగా రంగంలోకి దిగి సత్తా చాటేందుకు రెడీ అవుతుంది యశ్ రాజ్ ఫిల్మ్స్. తన ఓటీటీ కోసం కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటోన్న ఆదిత్యా చోప్రా.. ఫస్ట్ గ్రాండ్ రిలీజ్ కోసం పెద్ద స్కెచ్చే గీసాడు. తన సంస్థ ద్వారా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోన్న హీరోలను బరిలోకి దింపుతున్నాడు. 100కోట్ల స్టార్టింగ్ ప్రాజెక్ట్ తో చుక్కలు చూపిస్తానంటోన్న ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Evaru Meelo Koteeswarulu: మహేష్ ఎపిసోడ్‌‌కి ముహూర్తం ఫిక్స్.. టీఆర్పీలు బద్దలే!

50 సంవత్సరాల క్రితం ప్రారంభమైన యశ్ రాజ్ ఫిలిమ్స్.. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తూ సక్సెస్ లు కొడుతూనే ఉంది. ఆడియెన్స్ టేస్ట్ కు తగ్గట్టు మారుతుంది కాబట్టే ఇప్పటికీ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ గా బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. సేమ్ ఇప్పుడూ అంతే లెవెల్ లో అప్ డేట్ అవ్వాలనుకుంటున్నాడు యశ్ రాజ్ ఫిల్మ్స్ ఓనర్ ఆదిత్య చోప్రా. ప్రెజెంట్ ట్రెండ్ అంతా ఓటీటీలోనే కదా. అందుకే ఆ ఓటీటీ బాటలోనే నడవాలనుకుంటున్నాడు ఆదిత్య. అందుకోసం ఏకంగా 500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడు.

Bigg Boss 5: సారీ సారీ అంటూనే హగ్గులు.. ముద్దులు.. అరే ఏంట్రా ఇది!

అమితాబ్ నుంచి మొదలెడితే షారుఖ్, సల్మాన్, రణ్ వీర్, రణ్ బీర్ లాంటి హీరోలకు సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్ కి తగ్గట్టు కథలను మార్చి సినిమాలతో సక్సెస్ సాధిస్తూనే ఉంది. వందల కోట్లు పెట్టి ప్రతి సంవత్సరం ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి సినిమాలొస్తున్నాయి. ఈ సినిమాలకు ఓటీటీల్లో ఫుల్ గిరాకీ ఉంటుంది. ప్రైమ్ లాంటి సంస్థలు కోట్లు పెట్టి మరీ యశ్ రాజ్ ఫిల్మ్స్ సినిమాలను కొనేస్తున్నాయి. అయితే సొంతంగా ఓటీటీ ఉంటే బెటరనే ఆలోచనతో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టబోతున్నాడు ఆదిత్య చోప్రా. యశ్ రాజ్ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో అతిత్వరలో ఓటీటీ యాప్ వచ్చేస్తున్నట్టు తెలుస్తోంది.

Vindhya Vishaka: అందాలే ఆయుధంగా యాంకర్ వింధ్యా!

కంటెంట్ ఉన్న కథలకు ఓటీటీలో ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు అందరకీ తెలిసిందే. అదే రీజన్ తో ఓటీటీని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు ఆదిత్య చోప్రా. భారతీయ మూలాలున్న కథల్ని తీసుకురావాలనే ప్లాన్స్ వేస్తున్నాడు. అందుకోసం గట్టిగానే ఖర్చు పెట్టేందుకు రెడీఅయ్యాడు. రీజనల్ గానే ఆహాలాంటి ఓటీటీతో సక్సెస్ చూస్తున్నారు అల్లు అరవింద్. సో ఇదే ఫార్ములాను నేషనల్ వైడ్ గా హై రేంజ్ లో అప్లై చేయబోతున్నాడు ఆదిత్యా చోప్రా.

OTT Films: తగ్గేదేలే.. వచ్చే వారం ఓటీటీలో రచ్చ రచ్చే!

థియేటర్స్ లో గ్రాండ్ గా సినిమాలు రిలీజ్ చేస్తూనే ఓటీటీలో సూపర్ కంటెంట్ నింపాలనేది ఆదిత్యా చోప్రా ప్లాన్. తను లాంచ్ చేయబోయే వైఆర్ ఎఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ కోసం కంటెంట్ ఉన్న మినిమం బడ్జెట్ సినిమాలను ఓకే చేస్తున్నాడు. అయితే గ్రాండ్ గా ఆ ఓటీటీ జనాల్లోకి వెళ్లాలంటే మాత్రం స్టార్స్ ముద్ర ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు ప్రణాళికలు రచిస్తున్నాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లేదంటే హృతిక్ రోషన్ లను కలిపి ఓ 100 కోట్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఆదిత్య ఆలోచన ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

OTT Films: ఈ వారం అరడజను సినిమాలు.. ఫుల్ మీల్స్ ఇస్తున్న ఓటీటీలు!

ఈ డిసెంబర్ లోనే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. షారుఖ్, సల్మాన్ లతో ఆల్రెడీ డీలింగ్స్ కూడా అయిపోయాయనే టాక్ నడుస్తోంది. నిజంగా ఇది గనుక వర్కవుటయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ వారి ఓటీటీ దూసుకెళ్లడం ఖాయం. ఎటూ మినిమం గ్యారెంటీ సినిమాలు స్పెషల్ గా ఓటీటీ కోసం డిజైన్ చేస్తున్నారు. అటు భారీ బడ్జెట్ తో థియేటర్ ఎక్స్ పీరియెన్స్ కోసం నిర్మించే సినిమాలు తిరిగి తన సొంత ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతాయి. అందుకే ఇంతటి భారీ వ్యూహానికి తెరలేపాడు ఆదిత్య చోప్రా. ఆహా లాగానే ముందు ముందు బాలీవుడ్ స్టార్స్ తో డిఫరెంట్ షోస్ వచ్చినా ఆశ్చర్యం లేదు.

Nikki Tamboli: పోజులతోనే పిచ్చెక్కించే నిక్కీ!

ప్రస్తుతం దాదాపు 1200కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాలను రూపొందిస్తున్నాడు ఆదిత్య చోప్రా. పఠాన్, టైగర్ 3 లాంటి హై వోల్టేజ్ సినిమాలు ఈ బ్యానర్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇక అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ తో పాటూ షంషేరా, జయేశ్ భాయ్ జోర్ధార్, బంటీ ఔర్ బబ్లీ 2.. ఈ నాలుగు సినిమాలకు కలిపి ఈమధ్యే వచ్చిన 400కోట్ల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఆఫర్ కి నో చెప్పాడు ఆదిత్య. థియేట‌ర్ల‌ను న‌మ్ముకున్న డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లకు తన నిర్ణయం న‌ష్టాన్ని మిగిలుస్తుందన్న ఆలోచనలో థియేటర్స్ కే ఓటేసారు. అయితే ఈ సినిమాలు ముందు థియేటర్స్ తర్వాత విండో గ్యాప్ తో ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు