KGF2: ట్రైలర్‌తో స్పాట్ పెట్టేసిన రాఖీభాయ్.. అంచనాలకు మించి కేజీఎఫ్2!

సాలిడ్ ట్రైలర్ తోనే థియేటర్స్ లో స్పాట్ పెట్టాడు రాఖీభాయ్. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడంటూ కేజీఎఫ్ చాప్టర్ 2పై అంచనాలు పెంచేసాడు. కెజీఎఫ్ అనేది కేజీఎఫ్2కి ట్రైలర్ మాత్రమే అని..

KGF2: ట్రైలర్‌తో స్పాట్ పెట్టేసిన రాఖీభాయ్.. అంచనాలకు మించి కేజీఎఫ్2!

Kgf2

KGF2: సాలిడ్ ట్రైలర్ తోనే థియేటర్స్ లో స్పాట్ పెట్టాడు రాఖీభాయ్. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడంటూ కేజీఎఫ్ చాప్టర్ 2పై అంచనాలు పెంచేసాడు. కెజీఎఫ్ అనేది కేజీఎఫ్2కి ట్రైలర్ మాత్రమే అని చెప్పిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడీ సీక్వెల్ తో పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. పాన్ ఇండియా అంచనాలు.. అంచనాలకు మించిన లెక్కలతో రాబోతున్న యశ్ సినిమాపై పూర్తి డిటేల్స్ ఇప్పుడు చూద్దాం.

KGF2: కేజీఎఫ్2.. ట్రైలర్‌తోనే రికార్డుల మోత!

కొత్త రికార్డ్స్ సెట్ చేయడానికి వచ్చేస్తోంది కన్నడ సినిమా. అసలేలాంటి అంచనాలకు లేకుండా వచ్చి కేజీఎఫ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతకుమించి అన్న లెవెల్ లో ఇప్పుడు కేజీఎఫ్2ను పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్ కు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా తీసుకొస్తున్నాడు ప్రశాంత్ నీల్. ట్రైలర్ చూస్తుంటేనే యాక్షన్ సీక్వెన్సెస్, మాసివ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. సౌత్ తో పాటూ ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ కోరుకుంటున్నట్టు కంప్లీట్ మాస్ పీరియాడికల్ డ్రామాగా కేజీఎఫ్2ను రెడీ చేశారు మేకర్స్.

KGF2: జక్కన్న దారిలో ప్రశాంత్.. పెరిగిన కేజీఎఫ్ 2 ప్రమోషన్ల స్పీడ్!

పాన్ ఇండియా సినిమాల పాత వసూళ్ల రికార్డ్ ను బ్రేక్ చేసేలా కేజీఎఫ్2ను బరిలోకి దింపుతున్నారు హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు. పవర్ఫుల్ డైలాగ్స్ తో స్లోగా పీక్స్ కు చేరిన ట్రైలర్ లో యశ్ ఎంట్రీ లేట్ అయినా వావ్ అనిపించే ఎలివేషన్స్ తో అట్రాక్ట్ చేశాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కన్నడ ప్రైడ్ గా కేజీఎఫ్ ను పొగిడిన యశ్.. చాప్టర్ 2 మరింత బాగుంటుందని ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ డబుల్ చేశాడు. సినిమా మాక్సిమమ్ క్రెడిట్ ప్రశాంత్ నీల్ అకౌంట్ లో వేసిన యశ్.. కేజీఎఫ్ కోసం వర్క్ చేసిన వారందరి తర్వాత లీస్ట్ పొజిషన్ లో తాను ఉంటానని చెప్పుకొచ్చాడు.

KGF2: బ్లాస్టింగ్ అప్డేట్.. ఒక్క ఇండియాలోనే 6 వేల థియేటర్లు?

కేజీఎఫ్ చాప్టర్ 1తో పోలిస్తే.. కాస్టింగ్, బడ్జెట్ పరంగా కేజీఎఫ్ చాప్టర్ 2 మరింత భారీగా తెరకెక్కింది. 100 కోట్ల హ్యూజ్ బడ్జెట్ తో.. నేషనల్ వైడ్ ఆడియెన్స్ ఎదురుచూసేలా పార్ట్ 2కు మరిన్ని హంగులు చేర్చారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ సంజయ్ దత్, రవీనా టండన్.. తెలుగు, తమిళ్ నుంచి రావు రమేశ్, ప్రకాశ్ రాజ్‌, ఈశ్వరీరావ్ లాంటి వారిని యాడ్ చేసి బూస్టప్ ఇచ్చారు. ఇక కేవలం 15 గంటల్లో 7కోట్ల వ్యూస్ సాధించి 24 గంటల్లో మోస్ట్ వ్యూయడ్ ఇండియన్ ట్రైలర్ గా నిలిచిన కేజీఎఫ్2.. ఇండియన్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు రాకింగ్ ఫ్యాన్స్.