నటి యషికా ఆనంద్ కారు బీభత్సం..స్విగ్గీ డెలివరీ బాయ్‌కు తీవ్రగాయాలు

  • Published By: madhu ,Published On : October 6, 2019 / 10:51 AM IST
నటి యషికా ఆనంద్ కారు బీభత్సం..స్విగ్గీ డెలివరీ బాయ్‌కు తీవ్రగాయాలు

బిగ్ బాస్ 2, తమిళ సినిమాలతో అదరగొట్టిన నటి యషికా ఆనంద్ వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తిని ఢీకొంది. తీవ్రగాయాల పాలైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. అయితే..గాయాలపాలైన వ్యక్తిని పట్టించుకోకుండా..యషికా అక్కడి నుంచి జారుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం మత్తలో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందనే వార్తలు వెలువడుతున్నాయి. 

యషికా ఆనంద్..తన స్నేహితులతో కలిసి అక్టోబర్ 05వ తేదీ శనివారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తోంది. నుంగబాక్కమ్ ప్రాంతంలోకి రాగానే కారు అదుపు తప్పింది. అక్కడనే నిల్చొని ఉన్న స్విగ్గీ డెలివరీ బాయ్ భరత్‌ను ఢీకొంది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో కిరాణ షాపు ధ్వంసమైనట్లు సమాచారం. కానీ గాయపడిన భరత్‌ను వదిలేసి యషికా అక్కడి నుంచి జారుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భరత్‌ను రాజాజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

కానీ ప్రమాదం జరిగిన సమయంలో కారును ఎవరు డ్రైవ్ చేస్తున్నారో తెలియడం లేదు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో యషికా, ఆమె స్నేహితులు ఫుల్‌గా మద్యం సేవించి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీసులు కేసు రిజిష్టర్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక యషికా ఆనంద్ విషయానికి వస్తే…ఇరుట్టు ఆరైయిల్ మురట్టు కుట్టు, జోంబీ చిత్రాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు. బిగ్ బాస్ షోలో ఈమె ఫెర్మామెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. చలాకీగా, గ్లామర్‌గా కనిపిస్తూ అట్రాక్షన్‌గా నిలిచింది. మంచి కథలు ఎంచుకుని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని యషికా భావిస్తోంది. 
Read More : బ్యాంకు చోరీ డబ్బుతో సినిమాలు : లలితా జువెలర్స్ దొంగ గురించి షాకింగ్ విషయాలు