Yashoda: ఫిబ్రవరిలో రెండు సినిమాలతో సందడి చేస్తోన్న సమంత.. యశోద కూడా!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. మైథలాజికల్ ఎపిక్ మూవీగా రాబోతున్న ‘శాకుంతలం’లో సమంత పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని.. ఈ సినిమాతో సమంత కెరీర్ బెస్ట్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Yashoda: ఫిబ్రవరిలో రెండు సినిమాలతో సందడి చేస్తోన్న సమంత.. యశోద కూడా!

Yashoda: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. మైథలాజికల్ ఎపిక్ మూవీగా రాబోతున్న ‘శాకుంతలం’లో సమంత పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని.. ఈ సినిమాతో సమంత కెరీర్ బెస్ట్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకోనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Yashoda: హమ్మయ్య.. ఎట్టకేలకు యశోద డేట్ ఇచ్చేసిందిగా!

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ నెలలో మరో సినిమాతో సమంత తన అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆమె నటించిన రీసెంట్ మూవీ ‘యశోద’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది.

Yashoda: యశోదతో పాటు వస్తున్న మరో మూడు సినిమాలు

అయితే తాజాగా, ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రముఖ ఛానల్ ఈటీవీ తెలుగులో యశోద చిత్రాన్ని ఫిబ్రవరి 5 ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కానున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమాకు బుల్లితెరపై ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.