Yashoda: దీపావళి కానుకగా “యశోద” ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన సమంత..

సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ "యశోద". ఇటీవల విడుదల చేసిన టీజర్ లో సమంత చేసిన యాక్షన్ సీన్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. సినిమా విడుదల దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేశాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని సమంత...

Yashoda: దీపావళి కానుకగా “యశోద” ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన సమంత..

Yashoda: సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ “యశోద”. ఇటీవల విడుదల చేసిన టీజర్ లో సమంత చేసిన యాక్షన్ సీన్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వస్తున్న ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తుంది. తమిళ డైరెక్టర్స్ హరి-హరన్ లు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Samantha: వైరల్‌గా మారిన సమంత సోషల్ మీడియా పోస్ట్.. నాగచైతన్య-సమంత మళ్ళీ కలిసిపోతున్నారా?

సినిమా విడుదల దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేశాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని సమంత తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దీపావళి కానుకగా తెలియజేసింది.
అక్టోబర్ 27న 5:36 నిమిషాలకు సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు, ఆ విషయాన్ని తెలియజేస్తూ చిన్న వీడియో గ్లింప్స్ ని నేడు విడుదల చేశారు.

నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తుంది.