ఇది టీజర్ కాదు బాబోయ్..

చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఏడు చేపల కథ సెకండ్ టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : May 3, 2019 / 01:05 PM IST
ఇది టీజర్ కాదు బాబోయ్..

చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఏడు చేపల కథ సెకండ్ టీజర్ రిలీజ్..

ఓ ఆరు నెలల క్రితం ఏడు చేపల కథ అనే సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. యూత్‌కి మతిపోగొట్టే సరుకంతా సదరు టీజర్‌లో ఉండడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత అదే కంటెంట్‌తో మరికొన్ని టీజర్లు రిలీజవడంతో ఏడు చేపల కథని మర్చిపోయారు ఆడియన్స్. టీజర్ రిలీజయ్యాక బిజినెస్ డీల్ కూడా బాగానే జరిగిందని టాక్ వచ్చింది అప్పట్లో..

ఇప్పుడు తమ సినిమాని జనాలకి గుర్తు చెయ్యాలనుకుందో ఏమో, సినిమా టీమ్ రీసెంట్‌గా సెకండ్ టీజర్ రిలీజ్ చేసింది. టెంప్ట్ రవిగా అభిషేక్ తన స్టైల్‌లో చేసుకుపోతే, ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే రచ్చ రంబోలా చేసేసారు. చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఏడు చేపల కథ త్వరలో రిలీజ్ కానుంది.

వాచ్ టీజర్-2..