Yedu Tharala yuddham Glimpse : తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో ‘ఏడు తరాల యుద్ధం’
బొమ్మ సినిమా కంపెనీ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఏడు తరాల యుద్ధం. తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మ వేణుగౌడ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Yedu Tharala yuddham Glimpse
Yedu Tharala yuddham : బొమ్మ సినిమా కంపెనీ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఏడు తరాల యుద్ధం. తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మ వేణుగౌడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కిరణ్ శర్మ, అరుణ్, సురేష్ భీమగాని, శివ వర్కల, నవనీత్ ఝ, అనిల్, యాశిక, కరణ్ సింగ్ టాగూర్, శ్రీనివాస్, రవీందర్ బొమ్మ కంటి, బలగం సంజయ్ లు నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తైంది.
Kaithi 2 : ఖైదీ సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన కార్తీ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్..
పవన్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. విరాటపర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది. మానవ నాగరిక చరిత్రలో ప్రతి పుట రక్తాక్షర మారణహోమమే. నియంతలు ఆజ్ఞాపించారు. ప్రజలు వాళ్లకు తలవంచారు. ఈ సమాజంలో బానిస మనస్తత్వాన్ని పెంచిపోషించిన నిరంకుశ రాజరికాలు అంతరించిపోయాయి. సామ్రాజ్యాలు కూలిపోయాయి. ఖండాతర సముద్రాలు దాటుకుని ఆంగ్లేయులు వచ్చారు. బ్రిటిష్ నిరంకుశ సామ్రాజ్య వాదంపై ప్రజల్లో ఆగ్రహ ఆవేశాలు మొదలయ్యాయి. ప్రజల్లోంచి ఉద్యమ నాయకులు పుట్టుకువచ్చారు. అంతులేని రక్తపాతాల మధ్య ఎడతెగని యుద్ధం మొదలైంది. ఈ పోరాటం ముందు తెల్లజాతి తలవంచక తప్పలేదు. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. దేశం మొత్తం స్వాతంత్ర్య సంబరాల్లో మునిగితేలుతుంటే తెలంగాణ మాత్రం రణతంత్రంతో రగిలిపోయింది అంటూ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ మొదలైంది. మొత్తంగా గ్లింప్స్ ఆకట్టుకుంది.