NTR 30: ఔను నిజమే.. ఎన్టీఆర్ సినిమాపై అలియా క్లారిటీ!

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎలా ముందుకెళ్లాలా అన్నది పక్కా ప్లాన్ తో ఉన్నాడని.. అందులో భాగంగానే రాబోయే తన సినిమాల లైనప్ సెట్ చేసుకున్నాడని..

NTR 30: ఔను నిజమే.. ఎన్టీఆర్ సినిమాపై అలియా క్లారిటీ!

Ntr 30

NTR 30: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎలా ముందుకెళ్లాలా అన్నది పక్కా ప్లాన్ తో ఉన్నాడని.. అందులో భాగంగానే రాబోయే తన సినిమాల లైనప్ సెట్ చేసుకున్నాడని ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ టాక్ నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ గ్యాప్ ను నాన్ స్టాప్ సినిమాలతో ఫుల్ ఫిల్ చేయాలని ఫిక్స్ అయిన తారక్ ముందుగా కొరటాల శివతో సినిమాను మొదలు పెట్టనున్నాడు.

Kangana Ranaut : రియాల్టీ షో హోస్ట్‌గా మారిన కంగనా.. లాంచింగ్ ఈవెంట్

అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనుండగా ఇందులో తారక్ పాత్ర ఎలా ఉండబోతుంది.. హీరోయిన్ ఎవరు.. మిగతా క్యాస్టింగ్ ఏంటి ఇలా చాలా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ హీరోయిన్ అలియా భట్. ఆర్ఆర్ఆర్ లో తనకి జోడిగా కాకపోయినా కలిసి నటించడంతో పాటు ఈ సినిమా షూటింగ్ ట్రావెలింగ్, ప్రమోషన్స్ లో అలియాతో ఎన్టీఆర్ కు మంచి బాండింగ్ ఏర్పడింది.

Kangana Ranaut : ఆమె సినిమాని నేను ప్రమోట్ చేయను.. దీపిక సినిమాపై కంగనా వ్యాఖ్యలు

దీంతో కొరటాల శివ సినిమా కోసం అలియా భట్ ను కన్ఫర్మ్ చేసినట్లు కథనాలొచ్చాయి. అయితే.. దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రాలేదు కానీ అలియా మాత్రం దీనిపై స్పందించి దాదాపుగా ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే విడుదల కానున్న తన సినిమా గంగూబాయి ప్రమోషన్స్ లో మీడియా ముందుకొచ్చిన అలియాకు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నారా అనే ప్రశ్న ఎదురైంది. కొరటాల శివ తనని అప్రోచ్ అయ్యారని.. మరోసారి ఎన్టీఆర్ తో నటించడానికి రెడీగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ 30వ సినిమాలో అలియానే హీరోయిన్ అని ఫిక్స్ అయినట్లే.