Big Boss 5: హమీదా కావాలా?.. టైటిల్ కావాలా?.. శ్రీరామ్‌కు నాగ్ సూటి ప్రశ్న!

బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఐదవ వారం కూడా ఎలిమినేషన్ సమయం ఆసన్నమవుతుంది. చూస్తుండగానే వారాంతం కూడా వచ్చేయడంతో నాగ్ కూడా వచ్చేశాడు. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం శనివారం ప్రోమోలు కూడా..

Big Boss 5: హమీదా కావాలా?.. టైటిల్ కావాలా?.. శ్రీరామ్‌కు నాగ్ సూటి ప్రశ్న!

Big Boss 5

Big Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఐదవ వారం కూడా ఎలిమినేషన్ సమయం ఆసన్నమవుతుంది. చూస్తుండగానే వారాంతం కూడా వచ్చేయడంతో నాగ్ కూడా వచ్చేశాడు. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం శనివారం ప్రోమోలు కూడా విడుదల చేయడంతో బిగ్ బాస్ ప్రేక్షకులకు వీకెండ్ సందడి మొదలైంది. శనివారం అంటేనే బిగ్ బాస్ ఇంట్లో సరదా సమయం కావడంతో యధావిధిగా సభ్యులంతా అందంగా ముస్తాబై సోఫాలలో సెట్టయ్యారు.

Most Eligible Bachelor: హిట్ కొడతానని అఖిల్ శపథం.. అంత కాన్ఫిడెంట్ ఏంటో!

ఇక ఇంట్లో మరికాస్త సందడి పెంచేందుకు మెగా హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు క్రిష్ తో కలిసి ఇంటి సభ్యులను పలకరించేందుకు వచ్చారు. కొండపోలం సినిమా ప్రమోషన్ లో భాగమైనా ప్రోమోలను చూస్తే ఈ వారం మరికాస్త ఎంటర్టైన్మెంట్ దొరికేలా ఉంది. ఇందులో భాగంగానే నాగ్ కూడా సభ్యులను కాస్త నాటీ ప్రశ్నలతో షోను మరింత జోవియల్ గా చేశారు. స్టేజ్ మీదకి వచ్చిన కొండపోలం టీంను నాగ్ ఎన్నిరోజులలో సినిమా చేశారని ప్రశ్నించగా దర్శకుడు క్రిష్ నలభై రోజులేనని సమాధానమిచ్చాడు.

Big Boss 5: ఎలిమినేషన్‌లో తొమ్మిదిమంది.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

దీంతో వైష్ణవ్ మారేందుకు నలభై రోజులు పడితే.. బిగ్ బాస్ ఇంట్లో సభ్యులకు 105 రోజులు పడుతుందని నాగ్ జోక్ చేశాడు. ఇక సభ్యులకు ఎన్ కౌంటర్ లో భాగంగా.. టైటిల్ ఫెవరెట్ గా ఉన్న శ్రీరామచంద్రను నాగ్ నీకు బిగ్ బాస్ టైటిల్ కావాలా.. హమీదా కావాలా అని సూటిగా ప్రశ్నిస్తే శ్రీరామ్ టైటిల్ మాత్రమే కావాలన్నాడు. దీంతో దర్శకుడు క్రిష్ తనని ఈ ప్రశ్న అడిగితే హమీదా కావాలనేవాడినని కొంటె సమాధానమివ్వడంతో హౌస్ లో నవ్వులు పూశాయి. మొత్తంగా ఆసక్తికరంగా ప్రోమో కట్ చేయగా మరి ఈ శనివారం ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.