Tina Sadhu : ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ మరణం.. షాక్‌లో సినీ పరిశ్రమ.. | Young Choreographar Tina Sadhu Passes away

Tina Sadhu : ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ మరణం.. షాక్‌లో సినీ పరిశ్రమ..

ప్రముఖ కొరియోగ్రాఫర్ టీనాసాధు గోవాలో అనుమానాస్పదంగా మరణించింది. ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన రియాలిటీ డ్యాన్స్ షో ఆట సీజ‌న్ 1లో.............

Tina Sadhu : ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ మరణం.. షాక్‌లో సినీ పరిశ్రమ..

Tina Sadhu :  ప్రముఖ కొరియోగ్రాఫర్ టీనాసాధు గోవాలో అనుమానాస్పదంగా మరణించింది. ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన రియాలిటీ డ్యాన్స్ షో ఆట సీజ‌న్ 1లో ఆట సందీప్ తో కలిసి పాల్గొని టైటిల్ విన్న‌ర్ గా నిలిచింది టీనాసాధు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా ప్రయత్నాలు చేస్తూ డ్యాన్సర్ గా కొనసాగింది. తర్వాత పలు సినిమాలకి కొరియోగ్రాఫర్ గా పని చేసిన టీనా ఆట సీజన్ 4కి జడ్జిగా కూడా వ్యవహరించింది.

టీనా రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొంతకాలంగా సినీ పరిశ్రమకి దూరంగా గోవాలో ఉంటుంది. తాజాగా టీనా మరణించిన విషయాన్ని ఆట సందీప్ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. టీనా ఫోటో, తను టీనాతో టైటిల్ తీసుకున్న ఫోటో షేర్ చేసి.. ”టీనాసాధు మరణించిందన్న వార్త విని షాక్ అయ్యాను, తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. నాకు తెలిసిన వారిలో గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి టీనా. రియాలిటీ షోలో ఆమె నా కో పార్ట్‌న‌ర్ కూడా. టీనా ఆకస్మిక మృతి పట్ల ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని పోస్ట్ పెట్టాడు.

Vikram : ఇద్దరు స్టార్ హీరోలతో కమల్ హాసన్ సినిమా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా..

టీనా మరణంతో డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు తీవ్ర విషాదంలో ఉన్నారు. సినీ పరిశ్రమలోని డ్యాన్సర్లు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే టీనా ఎలా మరణించిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep)

×