New Movies : సాఫ్ట్ టైటిల్స్‌తో వస్తున్న యువ హీరోలు..

సినిమా ఆడియన్స్ ని ముందుకు తీసుకెళ్లడం అంత ఈజీకాదు. స్టార్ కాస్ట్, మేకింగ్, బడ్జెట్, మ్యూజిక్ ఇవన్నీ ఎలా ఉండాలా..? ఎలా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యాలా అని కసరత్తులు చేస్తారు. కానీ వీటి గురించి పెద్దగా ఆలోచించకుండా.............

New Movies : సాఫ్ట్ టైటిల్స్‌తో వస్తున్న యువ హీరోలు..

Soft Titles Movies

Tollywood :  సినిమా ఆడియన్స్ ని ముందుకు తీసుకెళ్లడం అంత ఈజీకాదు. స్టార్ కాస్ట్, మేకింగ్, బడ్జెట్, మ్యూజిక్ ఇవన్నీ ఎలా ఉండాలా..? ఎలా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యాలా అని కసరత్తులు చేస్తారు. కానీ వీటి గురించి పెద్దగా ఆలోచించకుండా అసలు సినిమా టైటిల్ తోనే కావల్సినంత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు యువ హీరోలు, చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు. ఒకప్పుడు సినిమాలన్నీ సాఫ్ట్ టైటిల్స్ తోనే ఉండేవి. ఆ తర్వాత సినిమా టైటిల్స్ కి ఇంగ్లీష్ దూరడంతో టైటిల్స్ పై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండట్లేదు. కానీ ఇటీవల చిన్న, మీడియం సినిమాలు, యువ హీరోలు సాఫ్ట్ టైటిల్స్ ని పట్టుకొని వాళ్ళ సినిమాల మీద జనాలకి ఆసక్తి కలగచేస్తున్నారు.

ఇటీవల యువ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు, సమ్మతమే, ఎస్. ఆర్ కళ్యాణమండపం, వినరోభాగ్యము విష్ణుకథ.. ఇలా ఎక్కువగా సాఫ్ట్ టైటిల్స్ ని వాడుతున్నాడు. సినిమా ఫలితం ఎలా ఉన్న టైటిల్స్ తో సినిమా మీద జనాలకి ఆసక్తిని కలగచేస్తున్నాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా మొదటి నుంచి సాఫ్ట్ టైటిల్స్ నే వాడుతున్నాడు. ఉప్పెన, కొండపొలం, ఇప్పుడు త్వరలో రంగరంగ వైభవంగా అంటూ ట్రెడిషనల్ టచ్ ఉన్న టైటిల్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

Koffee with Karan : విజయ్ దేవరకొండనే కావాలి అంటున్న బాలీవుడ్ హీరోయిన్స్.. రిప్లై ఇచ్చిన రౌడీ హీరో..

సెన్సిబుల్ స్టోరీస్ తో సినిమాలు చేసే సుధీర్ బాబు హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్నారు. ఈ మధ్య సినిమాలతో ప్రయోగాలు చేస్తున్న నాగశౌర్య అవేవి వర్కౌట్ అవ్వట్లేదని ప్యూర్ లవ్ స్టోరీగా యూత్ ని టార్గెట్ చేశారు. సరికొత్త మూవీ టైటిల్ ‘కృష్ణ వ్రిందా విహారి’ అని బజ్ క్రియేట్ చేశాడు నాగశౌర్య. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో హీరో గణేష్ తన మొదటి సినిమాకి స్వాతిముత్యం అనే సూపర్ సాఫ్ట్ సక్సెస్ టైటిల్ పెట్టేసి సినిమాపై అంచనాలు నెలకొల్పాడు. అలాగే మరో హీరో సత్యదేవ్ కూడా గుర్తుందా శీతాకాలం అంటూ సరికొత్త టైటిల్ తో బ్రాబోతున్నాడు. ఇలా యువ హీరోలంతా సాఫ్ట్ టైటిల్స్ పెట్టి తమ సినిమాలకి టైటిల్స్ తోనే ఆసక్తి పెంచుతున్నారు.