Zee 5 : ఓటీటీల పోటీ.. ఏకంగా 111 సినిమాలు, సిరీస్ లను ప్రకటించిన జీ5

తాజాగా జీ5 ఓటీటీ కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే జీ5 కి ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. సౌత్ భాషల్లో కూడా జీ5 లోకల్ కంటెంట్ ని అందచేస్తోంది.

Zee 5 : ఓటీటీల పోటీ.. ఏకంగా 111 సినిమాలు, సిరీస్ లను ప్రకటించిన జీ5

Zee 5 announce 111 movies and series on their ott coming soon

OTT : ప్రస్తుతం దేశంలో ఓటీటీ(OTT) ట్రెండ్ నడుస్తుంది. థియేటర్(Theater) లో సినిమాలు చూడడానికంటే ఇంట్లో కూర్చొని ఓటీటీ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్(Amazon Prime), హాట్ స్టార్, జీ5, ఆహా(AHA) వంటి ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. కేవలం సినిమాలతోనే కాదు వెబ్ సిరీస్(Web Series), టాక్ షోస్, సింగింగ్ అండ్ రియాలిటీ షోస్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఇక ఓటిటి కంటెంట్ పై సినీ ప్రియులు మరింత ఆసక్తి చూపిస్తుండటంతో కొత్త కొత్త సిరీస్ లు, సినిమాలు రిలీజ్ చేస్తూ ఓటీటీలలో పోటీ పెరిగింది.

ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఇండియాలో తన మార్కెట్ ని పెంచుకునేందుకు అన్ని భాషల్లో సొంత కంటెంట్ చేయడం మొదలుపెట్టింది. ఇక సోనీ లివ్ కూడా సౌత్ భాషల్లో దాదాపు 40 సిరీస్ లు, సినిమాలు ప్రకటించింది. మన తెలుగు ఓటీటీ ఆహా అయితే ప్రతి శుక్రవారం ఓ కొత్త సినిమాను తీసుకొస్తూనే పలు షోలు ప్లాన్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం జియో మూవీస్ కూడా పూర్తి స్థాయి ఓటీటీగా మారి ఏకంగా 100 సినిమాలు, సిరీస్ లు రాబోతున్నట్టు ప్రకటించి ఒకేసారి ఇండియన్ ఓటీటీలకు పోటీ ఇచ్చింది.

Korean Movoies : ఇండియన్ సినిమా కొరియన్ లో రీమేక్.. ఇన్నాళ్లు కొరియన్ సినిమాలు ఇక్కడ.. కానీ ఇప్పుడు..

దీంతో తాజాగా జీ5 ఓటీటీ కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే జీ5 కి ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. సౌత్ భాషల్లో కూడా జీ5 లోకల్ కంటెంట్ ని అందచేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా పలు భాషల్లో జీ5 111 సినిమాలు, సిరీస్ లను ప్రకటించింది. వీటిలో సగంకు పైగా జీ5 సొంతంగా నిర్మిస్తుంది. త్వరలోనే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జీ5 ఓటీటీలోకి రాబోతున్నాయి. జీ5 చేసిన ఈ ప్రకటనతో మిగిలిన ఓటీటీలు తమ కంటెంట్ పై దృష్టి సారించాయి. మరి జీ5 రిలీజ్ చేసే ఈ సినిమాలు, సిరీస్ లు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.