చిన్నప్పటి చిరంజీవే ‘జాంబీ రెడ్డి’..

10TV Telugu News

Zombie Reddy Firstlook: ‘అ!’ సినిమాతో జాతీయ అవార్డు పొందిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఇటీవల తన మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ని ప్రకటించారు. తెలుగులో ఇది మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్ కావ‌డం విశేషం.
అయితే ‘జాంబీ రెడ్డి’లో హీరోగా ఎవ‌రు న‌టిస్తున్నార‌నే స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ ఆదివారం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ల‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ చిత్రంలో చిన్న‌ప్ప‌టి చిరంజీవిగా న‌టించడంతో పాటు ప‌లు చిత్రాల్లో బాల న‌టుడిగా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లూ పొంది, స‌మంత నాయిక‌గా న‌టించిన ‘ఓ బేబీ’లో ఓ కీల‌క పాత్ర‌లో ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా ‘జాంబీ రెడ్డి’తో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్లో హీరోని వెనుకనుంచి చూపించారు.

ఇక ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో తేజ గ‌ద ప‌ట్టుకొని ఉండ‌గా, జాంబీలు అత‌నిపై ఎటాక్ చేయ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మోష‌న్ పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే, వెన‌క‌వైపు మెగాస్టార్ చిరంజీవి బొమ్మ ఉన్న ష‌ర్ట్ ధ‌రించి క‌న‌ప‌డుతున్నాడు తేజ‌. మోష‌న్ పోస్ట‌ర్ బీజీఎంగా చిరంజీవి సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘దొంగ‌’లోని పాపుల‌ర్ సాంగ్ ‘‘కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో’’ మ్యూజిక్‌ను ఉప‌యోగించారు. ఆదివారం తేజ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసినట్లు మేకర్స్ తెలిపారు. విభిన్న సినిమాలను తెరకెక్కించడానికి ఇష్టపడే ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ‘జాంబీ రెడ్డి’ కరోనా వైరస్‌పై కర్నూలు ప్రజలు ఎలా పోరాడారనే కథాంశంతో రూపొందబోతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

10TV Telugu News