లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

పూర్వికుల గురించి తెలిసిపోతుందని ఓవైసీకి భయం : కేసీఆర్ పెద్ద కొడుకులా మారారు

NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ

Published

on

mp dharmapuri arvind fires on owaisi

NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ

NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన విమర్శలకు.. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. తన పూర్వికుల గురించి వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే అసదుద్దీన్ ఓవైసీ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నారని అరవింద్ అన్నారు.

ఓవైసీ తన స్వార్థ రాజకీయం కోసం ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఏఏ వల్ల భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఓవైసీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. ఎన్ఆర్సీపై ఇటాలియన్ మాఫియా రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎంత వ్యతిరేకించినా.. సీఏఏ, ఎన్ఆర్సీల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని అరవింద్ తేల్చి చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వంపైనా ఎంపీ అరవింద్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ కు అసదుద్దీన్ పెద్ద కొడుకులా మారారని విమర్శించారు. మైనార్టీలు ఓవైసీలో మాయలో పడొద్దని కోరారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.

Also Read : నేను హిందువులకు వ్యతిరేకం కాదు : ముస్లింలతో పాటు క్రైస్తవులు, దళితులకు ఇబ్బందులు తప్పవు