లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

దయచేసి వదిలేయండి, పోలీసులకు చేతులెత్తి మొక్కిన వైసీపీ ఎంపీ

లాక్ డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు పెద్ద సంఖ్యలో సీజ్ చేసిన

Published

on

mp gorantla madhav request police

లాక్ డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు పెద్ద సంఖ్యలో సీజ్ చేసిన

లాక్ డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు పెద్ద సంఖ్యలో సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇలా వాహనాలను సీజ్ చేసిన పోలీసులు వాటిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఉంచిన విషయం విదితమే. అయితే రోజుల తరబడి ఒకే చోట ఉంచడంతో అవన్నీ ఎండకు ఎండి వానకు తడిచి చెడిపోయే పరిస్థితి ఏర్పడింది. అనంతపురం జిల్లా హిందూపురంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీనిపై స్థానిక ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ స్పందించారు. పోలీసులకు ఆయన చేతులెత్తి నమస్కరించారు. దయచేసి సీజ్ చేసిన వాహనాలను వదిలేయండి అని విజ్ఞప్తి చేశారు.

వాహనాలు మంటల్లో తగలబడిపోయే ప్రమాదముంది:
హిందూపురంలో గురువారం(మే 21,2020) స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులతో ఎంపీ మాధవ్ మాట్లాడారు. పోలీసులు సీజ్ చేసిన వాహనాల గురించి ప్రస్తావించారు. మీకు చేతులేత్తి మొక్కుతా.. ద్విచక్ర వాహనాలను స్టేషన్‌లో ఎండ పెట్టకుండా వదిలేయండి అని పోలీసులను కోరారు. ఆయా వాహనదారులకు కోర్టు ద్వారా స్టేషన్‌ జరిమానాలు విధించి వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కువ రోజులు ఎండ పడితే పెట్రోల్‌ ఉన్న వాహనాల నుంచి మంటలు ఎగిసి.. బెంగళూరు నగరంలో జరిగినట్లుగా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ కూడా పోలీసులకు సూచించారు.

మీసం మెలేసి జేసీకి సవాల్ విసిరిన మాధవ్:
కాగా, గోరంట్ల మాధవ్ మాజీ పోలీస్ అనే విషయం తెలిసిందే. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారిగా వైసీపీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్న సమయంలో గోరంట్ల మాధవ్ కు గబ్బర్ సింగ్ అని పిలిచే వారు. సీఐగా చాలా దూకుడుగా ఉండేవారని పేరుంది. పోలీసుల గురించి తప్పుగా మాట్లాడిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై పోలీస్ గా ఉన్న సమయంలో గోరంట్ల మాధవ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మీసం మెలేసి మరీ జేసీ దివాకర్ రెడ్డి కి సవాల్ విసిరారు.

Read: డాక్టర్ సుధాకర్ కేసు : సీబీఐ విచారణకు ఆదేశించిన హై కోర్టు