లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కరోనా సోకి 102 మంది భోపాల్ గ్యాస్ బాధితులు మృతి..36ఏళ్లు గడిచిన వదల్లేదు

Published

on

MP Bhopal corona 120 Died: మధ్యప్రదేశ్లోని భోపాల్ విషవాయువు నుంచి బయటపడినా.. బాధితుల్ని కరోనా మహమ్మారి మాత్రం వదల్లేదు. ప్రాణాలు తీసేదాకా పట్టి పీడించింది. కనికరించిని కరోనా భోపాల్ విషవాయువు బాధితులను కబళించివేసింది. భోపాల్ విషవాయువుల నుంచి బతికి బైటపడ్డ బాధితుల్లో 102 మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కానీ అలా కరోనాతో మృతి చెందినవారి ఇంకా ఎక్కువమందే ఉన్నారని కానీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఎన్జీవో సంఘాలు అంటున్నాయి.వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో 1984వ సంవత్సరంలో విషవాయువు విపత్తు నుంచి బయటపడిన 254 మంది బాధితులకు కొవిడ్ -19 సోకిందని వారిలో 102 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.భోపాల్ గ్యాస్ విషాద 36వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో విషవాయువు బాధితులు కరోనాతో మరణించారని వెల్లడించింది. కానీ విషవాయుల బాధితులు కరోనా సోకి 254మంది వరకూ చనిపోయారని ఎన్జీవో సంఘాలు అంటున్నాయి.ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విపత్తు అయిన భోపాల్ నగరంలో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి 1984 డిసెంబరు 2వతేదీ అర్దరాత్రి మిథైల్ ఐసోసైనెట్ గ్యాస్ లీక్ అయింది. ఈ విషవాయువు వల్ల 15వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐదు లక్షల మందికి పైగా ప్రజలు విషవాయువుతో ప్రభావితమయ్యారు. నాటి గ్యాస్ విపత్తు నుంచి బయటపడిన 102 మంది కరోనాతో కన్నుమూశారని భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డైరెక్టర్ బసంత్ కుర్రే చెప్పారు.గ్యాస్ బాధితుల కోసం పనిచేస్తున్న నాలుగు సంస్థలు భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్, భోపాల్ గ్యాస్ పీడిట్ స్టేషనరీ కర్మచారి సంఘ్, భోపాల్ గ్యాస్ పీడిట్ మహిళా పురుష్ సంగర్ష్ మోర్చా, చిల్డ్రన్ ఎగెనెస్ట్ డౌ కెమికల్స్ సంస్థల ప్రతినిధులు గ్యాస్ విషాదం నుంచి బయటపడిన వారి కుటుంబాలకు అదనపు జాతీయ పరిహారం కోరింది. గ్యాస్ లీక్ వారిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుందని..దీనివల్లనే బాధితులకు కరోనా సులభంగా సోకి మరణించారని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *