Home » జామ కాయలన్ని నాన్నమ్మే తినేసిందన్న మనుమరాలు..యాసిడ్ తాగేసిన బామ్మ
Published
2 months agoon
MP grand mother death drink acid grand daughter guava : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 75 ఏళ్ల వృద్ధురాలు యాసిడ్ తాగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చక్కగా ఆరోగ్యంగా తిరగే బామ్మ ఎందుకు యాసిడ్ తాగిందో తెలిక కంగారుడపడ్డారు. కానీ ఆ బామ్మ ఐదేళ్ల మనుమరాలు తెలిసీ తెలియక అన్న మాటలకు మనస్తాపానికి గురైన యాసిడ్ తాగిందని తెలిసి ఆశ్చర్యపోయారు.
ఇండోర్ లోని బెట్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంత్రి నగర్ లో మీరాబాయి పాతి ఆశారామ్ అనే 80 ఏళ్లు దాటిన వృద్ధురాలు కొడుకు కైలాష్ కుశావహ్ కుటుంబంతో కలిసి ఉంటోంది. కొడుకుకు భార్య ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. వారి పెరటిలో ఓ జామ చెట్టు ఉంది. ఆ చెట్టు నిండా జామకాయలు విరగకాశాయి. వాటిలో కొన్ని బాగా పండిపోయి ఉన్నాయి.
ఈ క్రమంలో బామ్మ ఆదివారం మధ్యాహ్నాం ఏదో తాగి ఆత్మహత్యకు యత్నించినట్లుగా గుర్తించిన మీరాబాయి కొడుకు తన కొడుకు సహాయంతో తల్లిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఆమె యాసిడ్ తాగిందని డాక్టర్లు చెప్పటంటో కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతు మీరాబాయి సోమవారం మృతి చెందింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. దీనికి తమ ఐదేళ్ల కూతురు ‘‘ మన జామ చెట్టుమీదున్న జామపళ్లన్నీ నాన్నమ్మే తినేసింది’’అంటూ తన తల్లితో చెప్పింది. దీంతో ఐదేళ్ల పసిపిల్ల తెలిసీ తెలియక అన్న మాటలకే ఆమె మనస్తాపానికి గురై యాసిడ్ తాగిందని తెలిపారు.
ఆమె ఏ తాగిందోకూడా మాకు తెలియదనీ డాక్టర్లు చెబితేనే మా అమ్మ యాసిడ్ తాగిందనే విషయం తెలిసిందని మృతురాలి కొడుకు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బెట్మా పోలీసు అధికారి మనోహర్ బఘెల్ తెలిపారు.