లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

వీడియో…పెళ్లయిన 15రోజులకే భర్త ఆత్మహత్య, తట్టుకోలేక షాపింగ్ మాల్‌లో భార్య కూడా ఆత్మహత్యాయత్నం

Published

on

ఆ ప్రేమ జంటకు 15 రోజుల క్రితమే పెళ్లయింది. ఇద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా కాళ్ల పారాణి కూడా ఆరలేదు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. బాగా ఏడ్చింది. చివరికి, నువ్వు లేక నేను లేను అంటూ తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త దగ్గరికి చేరాలని తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఓ షాపింగ్ మాల్ కి వెళ్లింది. అక్కడ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్ లోని విజయ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లయిన 15 రోజులకే భర్త చనిపోగా, ప్రస్తుతం భార్య మృత్యువుతో పోరాడుతోంది.

ఇండోర్ కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని సానియా సుమన్ (28), ఉజ్జయినికి చెందిన శుభం ఖండేల్వాల్ 15 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇండోర్ లో కాపురం పెట్టారు. అయితే వీరి జీవితంలో అనుకోని ఘటన జరిగింది. బుధవారం ఖండేల్వాల్ సూసైడ్ చేసుకున్నాడు.

ఖండేల్వాల్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. తన మృతికి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేసే ఇద్దరు ఇంజినీర్లు కారణం అని సూసైడ్ నోట్ లో రాశాడు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భర్త మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన సానియాను తమతో హర్యానా తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చారు. వారు ఎయిర్ పోర్టుకి సమీపంలోని ఓ హోటల్ లో వెయిట్ చేస్తున్నారు. కాసేపట్లో ఎయిర్ పోర్టుకి వెళ్లాల్సిన సానియా తీవ్ర నిర్ణయానికి వచ్చింది. ఓ షాపింగ్ మాల్ లో 3వ అంతస్తు పైనుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనతో షాపింగ్ మాల్ లో ఉన్నవారు షాక్ తిన్నారు. యువతి చర్యతో నిర్ఘాంతపోయారు. అసలేం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. కాగా, పైనుంచి కింద పడటంతో సానియాకు తీవ్ర గాయాలు అయ్యాయి. తలకు, కాళ్లకు గట్టిగానే దెబ్బలు తాకాయి. ఆమెను మాల్ సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

సానియా దగ్గర పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. తాను తన భర్త దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నట్టు నోట్ లో రాసి ఉంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, యువతి షాపింగ్ మాల్ లో పైనుంచి దూకిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకరితో పెళ్ళి…మరో న‌లుగురితో స‌హ‌జీవ‌నం


ఇండోర్ లోని హోటల్ లో తమతో కలిసి ఉన్న సానియా, ఫ్రూట్ జూస్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్తున్నట్టు తమతో చెప్పిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో విజయ్ నగర్ లో ఉన్న షాపింగ్ మాల్ కి సానియా వెళ్లింది. ఆ మాల్ లో ఆత్మహత్యాయత్నం చేసింది. తమ కూతురు ఇలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *