Mp Vinod Kumar About Telangana State Development

ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తాం: వినోద్ కుమార్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామని టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామని టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించిన ఆయన.. తెలంగాణ అభివృద్ధిని ఉద్యమంగా చేస్తున్నామని, అందుకే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్‌లోకి వస్తున్నారని అన్నారు.

అలాగే తన స్థానికతపై పొన్నం ప్రభాకర్‌కు మాట్లాడే అర్హత లేదని వినోద్ కుమార్ అన్నారు. ఆ మాటకొస్తే సోనియాగాంధీపై పొన్నం ఏం చెప్తారని నిలదీశారు. 2014 ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలిచిన అభ్యర్థిగా రికార్డు బ్రేక్ చేసినట్లు వినోద్ కుమార్ గుర్తు చేశారు.
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు

గత పార్లమెంట్లో అత్యధిక సార్లు తెలంగాణ గురించి మాట్లాడానని, హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు రైల్వే లైన్ కోసం పోరాడి సాధించానని అన్నారు. కరీంనగర్‌ను కాజీపేట జంక్షన్ కంటే పెద్ద కూడలిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు శ్రమించానని, కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం నెలల తరబడి ఢిల్లీలో ఉండి సాధించినట్లు చెప్పారు.

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుపై టీఆర్ఎస్ ఎంపీలు చర్చించారని, ప్రత్యేక హైకోర్టు సాధించామని అన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని న్యాయవాద వృత్తి వదిలి రాజకీయాల్లోకి వచ్చానని వినోద్ కుమార్ అన్నారు.
Read Also : జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి

Related Posts