36 ఏళ్ల వితంతువుపై ఆరుగురు సామూహిక అత్యాచారం….నలుగురు అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

MP:మధ్యప్రదేశ్ లోని రేవాజిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న 36 ఏళ్ల వితంతువు పై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించటంతో తీవ్రంగా గాయపరిచారు. గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో భర్త చనిపోయిన వితంతువు(36) తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. ఆమె ఒకరి ఇంట్లో వంట మనిషిగా పని చేస్తోంది. కుమారుడు రోజు కూలి పనికి వెళుతుంటాడు. సెప్టెంబర్ 30 కుమారుడు పనికి వెళ్లినప్పుడు ఆమె వంట పనికి వెళ్లి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉంది.ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించటంతో వారు ఆమెను కొట్టారు. ఆ దెబ్బలకు ఆమె స్పహ కోల్పోయింది. అనంతరం వారు ఆమెను సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యారు.

కాగా…. 30వ తేదీ సాయంత్రం ఆమె కుమారుడు పని నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లో తల్లి కనపడలేదు. ఆమె గురించి తెలిసిన చోటల్లా ఎంక్వయిరీ చేసినా ఆమె ఆచూకి లభించలేదు. కాగా…. అక్టోబర్ 1వ తేదీన సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ నుంచి అతనికి ఫోన్ వచ్చింది. దీంతోవారు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.అక్టోబర్ 4 ఆదివారం నాటికి కొంత స్పహ లోకి వచ్చిన బాధితురాలు తనపై జరిగిన అత్యాచారాన్ని కొడుక్కి వివరించింది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో ఆమె కొడుకు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న మహిళా పోలీసు స్టేషన్ అధికారులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి ఆరాధనా సింగ్ పరిహార్ తెలిపారు. బాధితురాలు కోలుకున్న తర్వాత ఆమె వద్ద వివరాలు తీసుకుని కేసు దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు వివరించారు.

Related Tags :

Related Posts :