లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

స్మార్ట్ ఫోన్లో చూస్తూ జాతీయగీతం ఆలపించిన ఎంపీడీవో

Published

on

MPDO looking at the smart phone and singing the national anthem  : దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు   ఈ  రోజు ఘనంగా జరిగాయి. జాతీయపతాకాన్ని ఎగరేసినతర్వాత ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. చిన్నప్పటినుంచి అందరికీ పాఠశాల స్ధాయినుంచే జాతీయగీతాన్ని కంఠస్ధం చేయిస్తారు. కానీ జనగామ జిల్లాలో ఒక ఎంపీడీవో స్మార్ట్ ఫోన్లో చూస్తూ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జనగమా జిల్లా తరిగొప్పుల మండల కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఎంపీడీవో ఇంద్రసేన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని మొబైల్ ఫోన్ లో చూస్తూ ఆలపించారు. ఎంపీడీవో స్ధాయి వ్యక్తి జాతీయ గీతాన్ని స్మార్ట్ ఫోన్లో చూస్తూ ఆలపించటం ఏంటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోందియ.