Home » ధోనీ వ్యాపారంపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్
Published
3 days agoon
MS Dhoni’s ‘Kadaknath Chicken : బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై కూడా పడింది. తన ఫాంహౌస్‌లో కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత.. వైరస్ విజృంభణతో అంతా తలకిందులయింది. కడక్‌నాథ్ కోళ్లకు ప్రఖ్యాతిగాంచిన మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలోకి బర్డ్ ఫ్లూ ఎంటర్ కావడంతో ధోనీకి గట్టి దెబ్బకొట్టింది. సాధారణ కోళ్లతో పాటు కడక్‌నాథ్ కోళ్లలోనూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో.. ధోనీ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ధోనీ కోళ్ల ఫామ్ కోసం పెంచిన 2 వేల 500 కడక్‌నాథ్ కోళ్లు బర్డ్‌ఫ్లూ కారణంగా మృత్యువాత పడ్డాయి.
రాంచీలోని ఫాంహౌజ్‌లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ గిరిజన రైతు వినోద్ మేడాతో 2 వేల కడక్‌నాథ్ కోడిపిల్లల పంపిణీకి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ధోనీ ఫామ్‌హౌస్‌కు కోడిపిల్లలను పంపేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే జబువా జిల్లాపై బర్డ్ ఫ్లూ విరుచుకుపడింది. థాండ్లా మండలంలోని రుదిపాండా గ్రామంలో ఉన్న కడక్‌నాథ్ కోళ్ల ఫామ్‌లో బర్డ్ ఫ్లూ బయటపడింది. కొన్నికోళ్ల శాంపిల్స్ పరీక్షించగా బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. అప్రమత్తమైన అధికారులు ఆ ఫామ్ చుట్టుపక్కల ఆంక్షలు విధించారు. అక్కడ 550 పెద్ద కోళ్లు, 2,800 పిల్లలు ఉన్నాయి. ముందుజాగ్రత్తగా వాటన్నింటిని చంపేసి పూడ్చిపెట్టారు.
కడక్‌నాథ్ కోళ్లకు ప్రఖ్యాతిగాంచిన జబువా జిల్లాలోకి బర్డ్ ఫ్లూ ఎంటర్ కావడంతో.. అక్కడి నుంచి కోళ్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఉన్న కోళ్లనే చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ కోళ్లఫారానికి కడక్‌నాథ్ పిల్లలను పంపిణీ చేయడం వీలు కాదని వినోద్ మేడా స్పష్టం చేశారు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే కోళ్లను పంపిస్తామని చెప్పారు. దాంతో ఎంఎస్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి బ్రేకులు పడ్డాయి. ధోనీ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ఈ లాభసాటి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
కడక్ నాథ్ కోళ్లు అంటే చాలా ఫేమస్. ఇందులో ఐరన్ చాలా ఎక్కువ. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందంటున్నారు. మిగతా కోళ్ల కంటే..వీటి కోళ్ల ధరలు ఎక్కువే. నల్లగా, నల్ల బొగ్గు మాదిరిగా ఈ కోళ్లు కనిపిస్తాయి. అస్తమా, బీపీ, మధుమేహ రోగులకు ఎంతో బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కడక్ నాథ్ కోళ్లలో అద్భుతమైన ప్రోటీన్లు ఉన్నాయని కొవ్వు తక్కువగా ఉంటుందని..వీటిని తీసుకోవడం వల్ల..మంచి జరుగుతుందనే ప్రచారం విపరీతంగా జరిగింది. ఫలితంగా కడక్ నాథ్ కోళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.