Mumait Khan

కార్‌లో మందు, సిగరెట్లు తాగుతూ బూతులు తిట్టింది.. డ్రైవర్ రాజు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mumait Khan Goa Tour: ఐటెం స్టార్ ముమైత్ ఖాన్‌ తనకివ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిందని హైదరాబాద్‌కు చెందిన రాజు అనే క్యాబ్ డ్రైవర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. గోవా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే వివరాలు తాజాగా మీడియాతో వెల్లడించాడు రాజు. అతను మాట్లాడుతూ..


‘‘గోవా ట్రిప్‌ కోసం ముమైత్‌ ఖాన్‌ మూడు రోజులకు గాను రూ.30 వేలకు కారు మాట్లాడుకుంది. అయితే, ఐదు రోజుల పాటు గోవాలో తిప్పింది.
డీజిల్‌ ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది.. కారులో మద్యం, సిగరెట్లు తాగుతూ అసభ్యంగా ప్రవర్తించింది.. అలా చేయొద్దన్నందుకు నన్ను బూతులు తిట్టి బెదిరించింది.. ఆమె దగ్గర పనిచేసిన డ్రైవర్లు నాకు ఫోన్‌లు చేసి.. తమను కూడా ఇలానే ఇబ్బంది పెట్టిందని వారి బాధలు చెప్పుకుంటున్నారు..


రోజు కూలీ చేసుకునే నాపట్ల ఇలా అంత పెద్ద సెలబ్రిటీ అయిన ఆమె ఇలా వ్యవహరిస్తుందనుకోలేదు.. గోవా నుంచి వచ్చిన వెంటనే 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమందించాను.. మా క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తా.. నాకు రావాల్సిన రూ.15 వేలు ఇస్తుందో లేదో తెలీదు’’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు డ్రైవర్‌ రాజు..


Related Posts