Mumait Khan: డ్రైవర్ రాజు పై ముమైత్ ఖాన్ ఫిర్యాదు.. మీడియా పై ఫైర్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mumait Khan: సినీ నటి ముమైత్ ఖాన్‌ గోవా టూర్‌కు తీసుకెళ్లి తనకివ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిందని హైదరాబాద్‌కు చెందిన రాజు అనే క్యాబ్ డ్రైవర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు, తనపై ఆరోపణలు చేస్తున్న క్యాబ్ డ్రైవర్‌పై ఫిర్యాదు చేసేందుకు ముమైత్ ఖాన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత రెండు రోజులుగా నాపై జరుగుతున్న ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా మీద వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలు. 12 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. అందరి దగ్గరా నా మేనేజర్ నెంబర్ ఉంది. నాకు క్యాబ్ డ్రైవర్‌ని చీట్ చేయాల్సిన అవసరం ఏంటి?.

Mumait Khanకొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయి. నా క్యారెక్టర్‌ను‌ జడ్జ్ చేసే అధికారం మీకు ఎక్కడిది. మీడియా అండ్ సోషల్ మీడియాలో నా గురించి వస్తున్న వార్తలు చూసి షాక్ అయ్యాను. మనచుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అవి వదిలేసి నా పైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్‌కి రూ. 23,500 చెల్లించాను. అయినా డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు.. అతను చాలా ర్యాష్‌గా డ్రైవ్ చేశాడు.. పోలీసులకు కంప్లైంట్ చేశాను.. వారు చూసుకుంటారు’’.. అన్నారు ముమైత్ ఖాన్..

Related Posts