Home » పతంగ్ కోసం పరిగెడుతూ ఆవు పేడలో పడి బాలుడి మృతి
Published
2 months agoon
Cow Dung: ముంబైలోని కండీవాలీ ప్రాంతంలో గాలిపటం ఎగరేస్తూ.. ఆవుపేడలో పడి 10ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మకర సంక్రాంతి పండుగ రోజు.. గురువారం మధ్యాహ్నం లాల్జీ పడా ప్రాంతంలోని ఎస్ఆర్ఏ కాలనీలో పిల్లలంతా పతంగులు (గాలిపటాలు) ఎగరేస్తున్నారు. రోజంతా గాలిపటంతోనే గడిపేస్తున్న ఆ చిన్నారి.. దారం పట్టుకుని కింద ఏమున్నదో చూసుకోకుండా పరిగెడుతూనే ఉన్నాడు.
అయితే అక్కడ సొసైటీకి దగ్గర్లో ఆవు షెట్ ఉన్న సంగతి మర్చిపోయాడు. ముందుకు వెళ్తుండగా ఆవుపేడలో గాలిపటం పడటం చూశాడు. పతంగ్ ను పట్టుకోవడం కోసం అందులోకి దూకాడు. ఆవు పేడ లోపల పచ్చిగా ఉండటంతో అందులో నుంచి బయటకు రాలేక కూరుకుపోయి చనిపోయాడు. ఆ పక్కనే భవన నిర్మాణ కార్మికులకు కాపాడమంటూ అరిచిన బాలుడి ఆర్తనాదాలు వినిపించాయి.
అక్కడికి వెళ్లి చూసేసరికి కూరుకుపోతూ కనిపించాడు. అయితే ఆ మడుగు మొత్తం చాలా లోతు ఉండటంతో లోనికి దిగి కాపాడే ప్రయత్నం ఎవరూ చేయలేకపోయారు. పోలీస్ ఆఫీసర్లు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది వచ్చినా అందులోకి ఎంటర్ కాలేకపోయారు. చివరికి ఆవు పేడలో పూర్తిగా మునిగిపోయిన చిన్నారిని బయటకు తీసేందుకు అక్కడే ఉన్న క్రేన్ ను పిలిచారు.
బయటకు తీసిన తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో చనిపోయినట్లు కన్ఫామ్ అయింది. ఈ మేరు కాండివలీ పోలీసులు కేసుపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ను బట్టి ఒకవేళ నిర్లక్ష్యం కారణంగా చనిపోయినట్లు కూడా ఫైల్ చేయొచ్చని పోలీసులు అంటున్నారు.
పెరిగిపోతున్న పేడ దొంగతనాలు..! మహిళల నుంచి భారీస్థాయిలో పేడ స్వాధీనం!
ఆవు పేడ రక్షణకు సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది.. అధికారుల కీలక నిర్ణయం
చూడకుండానే..రూబిక్ క్యూబ్ సాల్వ్ చేశాడు, సచిన్ ఫిదా..వీడియో వైరల్
భారత విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసిన చైనా..ముంబై పవర్ కట్ వాళ్ల పనే
ఫ్రెండ్ షిప్ పేరుతో మోడల్ పై అత్యాచారం
ఇలాంటి వారి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఆనంద్ మహీంద్రాకు పిచ్చకోపం తెప్పించిన ప్రయాణికుడు