లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ముంబై మురికివాడల్లో షాక్ విషయాలు : 75 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు గుర్తింపు

Published

on

Mumbai : COVID-19 antibodies slums in Cuffe Parade : ముంబై మురికివాడల్లో కరోనా మహమ్మారి అధికారులకు షాక్ ఇచ్చింది. కరోనా బారిన పడి రోగులు కోలుకున్న తర్వాత వారిలో ఏర్పడే యాంటీ బాడీల విషయంపై పరిశోధకులు సర్వే నిర్వహించగా వారికి షాకి విషయాలు వెల్లడయ్యాయి.ముంబయిలోని కఫే పరేడ్ ప్రాంతంలోని 5 మురికి వాడల్లో పరిశోధకులు సర్వే నిర్వహించారు. ఈ సర్వే వెల్లడైన ఫలితాలు పరిశోధకులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ ఐదు మురికివాడల్లోను దాదాపు 75 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.ఈ ఐదు మురికివాడల్లోను మొత్తం 806 మందిని పరీక్షించగా..వారిలో 605 మందిలో యాంటీబాడీలు ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. వీళ్లలో కేవలం 8 మంది మాత్రమే తమకు గతంలో కరోనా సోకిందన్న విషయాన్ని తెలిపారట. చాలామందికి అసలు కరోనా లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి పోయుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.మరికొందరైతే వైరస్ బారినపడిన వారు ఆ విషయం అసలు బైటకే చెప్పలేదట. పరిశోధకులు వారిని అడిగినా వారా విషయం వెల్లడించలేదు. ముంబైలో ఓ పార్టీ కార్పొరేటర్, ఐబెట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సీరో ప్రివలెన్స్ సర్వే నిర్వహించగా ఇటువంటి షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి.ఈ మురికివాడల్లో నివసించే 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో 76 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయట. గతంలో బీఎంసీ ఇటువంటి ఓ సీరో ప్రివలెన్స్ సర్వే నిర్వహించగా, ఓ మురికివాడలో 45 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించారు. యాంటీబాడీల రేటు పురుషుల్లో కంటే మహిళల్లోనే అత్యధికంగా ఉందని తాజాగా ఐబెట్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

 

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *