మద్యం మత్తులో రేప్..,12వ అంతస్థు నుంచి దూకేస్తానంటూ బెదిరింపులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మధ్యప్రదేశ్ లో 28ఏళ్ల యువతిని రేప్ చేసిన ఘటనలో 45ఏళ్ల జ్యువెల్లర్ ను అరెస్టు చేశారు ముంబై పోలీసులు. మోడల్ గా పనిచేస్తున్న యువతిని ఆమె ఫ్రెండ్ ఫ్లాట్ లో మద్యం మత్తులో రేప్ చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. రాహుల్ జోహ్రీ అనే వ్యక్తిని అంబోలీ పోలీసులు శుక్రవారమే అరెస్టు చేశారు. మంగళవారం వరకూ పోలీస్ కస్టడీలోనే ఉంచనున్నారు.

దీనిపై జ్యూవెలర్ రాహుల్.. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని.. చెప్తున్నాడు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో అతనికి జ్యూవెల్లరీ షాప్ ఉన్నట్లు సమాచారం.

ఆ యువతి ఓ మోడల్.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్లాలని తాపత్రయపడుతుంది. జులై నెల మధ్యలో భోపాల్ కు వెళ్లింది. ఆ సమయంలోనే ఆమె జోహ్రీని కలిసింది. షాపులో రెండు ఆభరణాలు కొనుగోలు చేసింది. తనకు తెలిసిన వారు ముంబైలో ఉన్నారని అక్కడకు వచ్చి వ్యాపారం పెంచుకోవచ్చని చెప్పినట్లు వెల్లడించింది.జులై 23న జోహ్రీ కొన్ని ఆర్డర్లు ఉండటంతో సిటీకి వచ్చి అంధేరీలో ఉన్న యువతి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత మోడల్ కు ఆభరణాలు చూపించి మద్యం మత్తులో ఉన్నప్పుడు తనను జోహ్రీ రేప్ చేశాడని అంబోలీ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో మహిళ పేర్కొంది.

ఆమె మత్తులో నుంచి కోలుకున్న తర్వాత జోహ్రీ 12వ అంతస్తు నుంచి దూకేస్తానంటూ బెదిరించాడని అందుకే ఆమె ఫ్రెండ్ పోలీసులకు కాల్ చేసినట్లు తెలిపింది.

Related Posts