లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

డ్రగ్స్ దందాకు కేంద్రంగా మారిన ముంబై.. ఎన్సీబీ ఆపరేషన్‌లో సంచలన విషయాలు

Published

on

Drugs (మాదక ద్రవ్యాలు) దందా చేసే వాళ్లకు ముంబై అడ్డాగా మారిపోయిందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) విధుల్లో భాగంగా ఈ విషయం వెల్లడైంది.

‘ఇండియాలోని పలు మెట్రో సిటీలకు ప్రధాన గమ్య స్థానంగా మారింది ముంబై. ముంబై నుంచి దేశవ్యాప్తంగా కనెక్షన్స్ నడుస్తున్నాయని తెలుసుకుంది. పలువురి నుంచి సరుకు సీజ్ చేయడంతో పాటు, అరెస్టులు చేశారు. వారి వల్లనే సప్లై చైన్ అనేది బయటపడింది.‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రస్తుతం డ్రగ్ దందా వాళ్లపై పెద్ద ఎత్తులో ఆపరేషన్స్ నడిపిస్తుంది. డ్రగ్ ట్రాఫికింగ్ ను అడ్డుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. రెగ్యూలర్ ట్రాఫికింగ్ చేసి.. పలువురిని గుర్తించడంతో పాటు వారికి సరుకు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు’ అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తెలిపింది.

ఈ ఆపరేషన్స్‌లో భాగంగా.. ఎన్సీబీ కేజీ కొకైన్‌ను, 2కేజీల పీసీపీ (పెన్‌సైక్లిడైన్)ను వాసాయ్‌కు చెందిన ఎమ్ అహ్మద్ నుంచి అక్టోబరు 12న స్వాధీనం చేసుకుంది. ఎంహెచ్ఏ తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ కొకైన్, 2కేజీల పీసీపీ, 29.300కేజీల ఎమ్డీఏ, 70గ్రాముల మెఫెడ్రోన్ ను సీజ్ చేశారు.

ఇంటరాగేషన్ లో ఎమ్ అహ్మద్ అనే వ్యక్తి తనకు ఎస్కే సౌరబ్ దగ్గర్నుంచి సరుకు లభిస్తుంది రివీల్ చేశారు. అక్టోబర్ 13నుంచి వాసాయ్, పల్ఘార్ ప్రాంతాల్లో ఎస్కే సౌరబ్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పట్టుకునేందుకు ప్రయత్నించింది.

ఎస్కే సౌరబ్ ను పట్టుకుని సోదాలు చేయడంతో షాప్/గోడౌన్‌లలో 29.300కేజీల ఎమ్డీఏ 2020 అక్టోబరు 14న దొరికింది. విచారణలో భాగంగా అతను ఖానీవాడేకర్ అనే వ్యక్తి పేరు చెప్పాడు.

మరో ఆపరేషన్ లో ఎన్సీబీ జమ్మూ జోనల్ యూనిట్.. జమ్మూలోని నాగ్రోటా ప్రాంతంలో నిషేదించిన టోల్ ప్లాజా వద్ద 55ప్యాకెట్ల 56.4కేజీల చారస్ లభ్యమైంది. అతను ముంబైకు చేరుకోవాల్సినవాడే. ముంబై-పూణె హైవేలో నిందితుడ్ని పట్టుకున్నట్లు ఎన్సీబీ చెప్పింది.

ఇక మూడో ఆపరేషన్ ముంబైలో నిర్వహించారు ఎన్సీబీ అధికారులు. ప్రదీప్ రాజారామ్ సాహ్నీ 70 గ్రాముల మెఫెడ్రోన్ తో వెస్ట్ అంధేరీలో పట్టుబడ్డాడు. ‘తాను అంధేరీ, జుహూ ప్రాంతాల్లోని పలు ప్రాంతాలకు సప్లై చేస్తానని ప్రదీప్ ఒప్పుకున్నాడు. బాలాజీ టెలిఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్యూన్ గా పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి. పూర్తి సమాచారం కోసం ప్రదీప్ రాజారాం సాహ్నీను విచారించనున్నట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది.

నాలుగో ఆపరేషన్‌లో నైజీరియన్ దేశస్థుడైన ఉకా ఉమేకాను ఎన్సీబీ అరెస్టు చేసింది. ‘ఈ డ్రగ్ అనేది దక్షిణ అమెరికా దేశం నుంచి వచ్చినట్లు దానిని పాలి హిల్ ఏరియా, బంద్రా, అంధేరీ, జుహూ, ఖార్ ప్రాంతాల్లో డెలివరీ చేసేందుకు వెళ్తున్నట్లు తెలుసుకోగలిగారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *