పెళ్లి కుదిరింది..పార్టీ ఇస్తాను హోటల్ కి రమ్మన్నాడు..బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mumbai hotel gang rape : స్నేహం అనే ముసుగులో జరిగే దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. స్నేహితుల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. స్నేహితులని నమ్మి వెళ్లితే అఘాయిత్యాలు..అత్యాచారాలు..హత్యలు జరుగుతున్న ఈ క్రమంలో మరో దారుణం జరిగింది ముంబైలోని ఓ హోటల్ లో. స్నేహితుడని నమ్మి వెళితే బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ముంబైలోని అంధేరి-కుర్లా రోడ్‌లోని ఒక హోటల్ లో నవంబర్ 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం..ముంబైలో నలుగురు యువకులు స్నేహితులు. వారు అవినాశ్ పంగేకర్ అనే (28) శిశిర్ (27), తేజస్ (25) స్నేహితులు. వీరిలో అవినాశ్ పంగేకర్ కు పెళ్లి సెటిల్ అయ్యింది. దీంతో ఫ్రెండ్స్ కు పార్టీ ఇస్తానని ఫ్రెండ్స్ ని పిలిచాడు. తన ఇద్దరు ఫ్రెండ్స్ శిశిర్, తేజస్ లతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలను పిలిచాడు. గ్రాండ్ గా హోటల్లో పార్టీ ఇస్తానని పిలిచాడు. దీంతో శిశిర్, తేజస్ లతో పాటు సదురు ముగ్గురు అమ్మాయిలు ముంబైలోని అంధేరి-కుర్లా రోడ్‌లోని ఒక హోటల్ కి వచ్చారు.అన్నట్లుగానే అవినాశ్ అందరికీ పార్టీ ఇచ్చారు. ఇష్టమైంది తిన్నారు. తాగారు. జోకులేసుకున్నారు. జోష్ గా పార్టీ చేసుకున్నారు. పార్టీ అయిపోయింది. దీంతో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇక వెళ్లిపోతాం అన్నారు. కానీ అప్పటికే ప్లాన్ చేసుకున్న అవినాశ్, శిశిర్, తేజస్ లు ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు వెళ్లిపోవటానికి ఒప్పుకున్నారు. ఒక్క అమ్మాయిని మాత్రం ఉండమ్మాన్నారు.ఫ్రెండ్సే కదాని ఆ అమ్మాయి ఉండిపోయింది. మిగతా ఇద్దరూ వెళ్లే వరకూ అవినాశ్ ఫ్రెండ్ ఆగారు. వారు వెళ్లిపోగానే అక్కడే ఉండిపోయిన అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించారు. ఆ పై ముగ్గురు ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. అనంతరం ముగ్గురు హోటల్ నుంచి పరారయ్యారు.


మత్తు వదిలాక లేచాక తనకు జరిగిన ఘోరం అర్థమైంది ఆ అమ్మాయికి. ఏడ్చింది. చేసేదేమీ లేక లేని శక్తిని కూడగట్టుకుని తనలో తానే కుమిలిపోతు ఇంటికెళ్లిపోయింది. కానీ తనకు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడింది. కానీ ఆగలేకపోయింది. ఎట్టకేలకు తల్లిదండ్రులకు విషయం చెప్పింది.


దీంతో కూతుర్ని తీసుకుని గత ఆదివారం (నవంబర్ 15,2020) పోలీసు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related Tags :

Related Posts :