Mumbai Indians Target 214 Runs

DC Vs MI పంత్ పిచ్చికొట్టుడు.. ముంబై టార్గెట్ 214

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ముంబై: ఐపీఎల్ 2019 సీజన్ 12 లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ భారీ స్కోర్ చేసింది. రిషబ్ పంత్ రెచ్చిపోయాడు.

ముంబై: ఐపీఎల్ 2019 సీజన్ 12 లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ యువ ఆటగాడు రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. 27 బంతుల్లోనే 78 పరుగులు(నాటౌట్) చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 7 సిక్స్ లు , 7 ఫోర్లు ఉన్నాయి. 18 బంతుల్లోనే రిషబ్ హాఫ్ సెంచరీ బాదాడు. బుమ్రా వేసిన 17.5వ బంతిని బౌండరీకి తరలించి అర్థ శతకం సాధించాడు.

ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 36 బంతుల్లో 43 పరుగులు, ఇంగ్రామ్ 32 బంతుల్లో 47 పరుగులతో రాణించారు. టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై బౌలర్లలో మెక్లెనగన్‌ 3 వికెట్లు తీశాడు. బుమ్రా, పాండ్యా, కటింగ్ చెరో వికెట్ తీశారు. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్ లో 16 పరుగులు వచ్చాయి.

Related Posts