లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

లాక్‌డౌన్‌లో బిజినెస్ దెబ్బతింది. డబ్బుకోసం మగ వ్యభిచారిగా మారాడు. అక్కడా దెబ్బతిన్నాడు

Published

on

Male Prostitution: బిజినెస్‌మేన్ కాలేకపోయాడు. మగ వ్యభిచారి కావాలనుకున్నాడు. చివరకు ఈ ప్రయత్నమూ, అతనికి 15 లక్షల లాస్ చేసింది.

లాక్‌డౌన్ దెబ్బకు అతని బిజినెస్ ఆగిపోయింది. అప్పుడే కొందరు పరిచయమైయ్యారు. నువ్వు అందగాడివి. మంచి బాడీ ఉంది. నీలాంటివాళ్లతో పొందుకోసం అమ్మాయిలు వేలు ఖర్చుచేస్తారని చెప్పారు. మనోడూ అద్దంలో చూసుకున్నాడు. నిజమేనని అనుకున్నాడు.

నీలాంటి అందమైన మగాళ్ల కోసం అర్రులు చాచే అమ్మాయిలతో డేట్ చేస్తే, రోజుకో కొత్త అమ్మాయి, డబ్బు వస్తుందని అన్నారు. మనోడు కలలుగన్నాడు. కాకపోతే ఒక్కటే షరతు.

మగవ్యభిచారిగా అంటే male escortగా మారాలంటే ఫీజు కట్టాలి…. అప్పుడే escort service licence వస్తుందని అన్నారు.

ఈలోగా అతని ఫోన్ రింగవుతూనే ఉంది. మొదటిరోజే అతనికి సోనాలి అనే అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. అతని ఏజ్, బ్యాక్ గ్రౌండ్ గురించి అడిగింది. అతని ఫోటోస్ పంపించ మని అడిగింది. డేటింగ్ సర్వీస్ లో అతనికో జాబ్ ఇస్తానంది. అందుకోసం రూ.26,500 కట్టమంది. ఇది రిజస్ట్రేషన్ ఫీజు. ఆ తర్వాత రోజుకు 20వేలు సంపాదిస్తావని చెప్పింది.

ఆ తర్వాత సోనాలి నలుగురి అమ్మాయిల ఫోటోలను పంపించింది. నచ్చిన వాళ్లను ఎంచుకోమంది. అందంగా ఉన్న రాధికను బాధితుడు ఎంచుకొని ఫోన్ చేశాడు. ఆమె నీకు escort licence service ఉందా అని అడిగింది.

లేదు అనగానే, రూ.1.14 లక్షలు కట్టి లైసెన్స్ తీసుకోమని అంది. వారంలోనే అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఏడు లక్షలు కొట్టేశారు.

నాకేమీ వద్దు. డబ్బును రిఫండ్ చేయమంటే, రూ. 4.7లు డిపాజిట్ చేస్తే, డబ్బును వాపస్ ఇస్తామన్నారు. మొత్తంమీద బాధితుడు 15లక్షలు పోగొట్టుకున్నాడు. మగ వ్యభిచారిగా మారాలనుకున్న బాధితుడు, పోలీసులకు రిపోర్ట్ చేశాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *